)
Sukanya Samriddhi Yojana: ఆడపిల్ల పుడితే ఆమె పేరు మీద ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా పోస్టాఫీసులో ఉన్న సుకన్య సమృద్ధి యోజన (SSY) స్కీమ్ కు ఏడాదికి దాదాపుగా 8.2 శాతం వడ్డీని సంపాదిస్తోంది. ఈ వడ్డీ రేటుతో మీరు ఈ పథకంలో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టడం ద్వారా ఆడపిల్లకు 21 ఏళ్లు వచ్చే వరకు దాదాపు రూ. 70 లక్షల డబ్బు అందుతుంది. అదే సమయంలో ఈ మొత్తం నిధిని ఉపసంహరించుకునేటప్పుడు మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం అత్యధిక వడ్డీని అందించే ప్రభుత్వ పథకాలలో ఒకటి.
ఈ స్కీమ్ స్పెషాలిటీ ఏంటంటే మీరు దీనిలో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. కానీ తదుపరి 6 సంవత్సరాలు.. అంటే ఆ ఫండ్ మెచ్యూరిటీ అయ్యే వరకు మొత్తం బ్యాలెన్స్‌పై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ 21 ఏళ్లుగా ఉంది. కానీ పెట్టుబడి 15 సంవత్సరాలు మాత్రమే చేయాలి. పోస్టాఫీసుకు చెందిన ఈ పథకం బాలికల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టింది. సుకన్య సమృద్ధి యోజనకు అర్హత పొందాలంటే.. కుమార్తె వయస్సు 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
పన్ను మినహాయింపు + అధిక వడ్డీ రేటు
సుకన్య సమృద్ధి యోజన (జూలై నుండి సెప్టెంబర్ 2025 వరకు) వడ్డీ రేటు సంవత్సరానికి 8.2%. సుకన్య సమృద్ధి యోజన అనేది పన్ను రహిత పథకం. ఇది మూడు వేర్వేరు స్థాయిలలో పన్ను మినహాయింపును కలిగి ఉంది. అంటే EEE. మొదటిది, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై మినహాయింపు ఉంది. రెండవది, దాని నుండి వచ్చే ఆదాయంపై పన్ను లేదు. మూడవది.. ఆ డబ్బు పరిపక్వత తర్వాత అందుకున్న మొత్తం పన్ను రహితంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook