Jio Plans: జియో యూజర్స్ కి గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఆఫర్ ని తీసుకొచ్చిన ముఖేష్ అంబానీ..

Jio Plans: టెలికాం రంగంలో జియో అనేది ఓ సంచనలం. జియో వచ్చాకా భారత ప్రజలకు డాటా వినియోగం అనేది అలవాటైంది. అంతేకాదు జియో తన కస్టమర్లకు మంచి బెనిఫిట్స్ ని అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది.   

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 4, 2025, 09:45 AM IST
Jio Plans: జియో యూజర్స్ కి గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఆఫర్ ని తీసుకొచ్చిన ముఖేష్ అంబానీ..

Jio Plans: వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల రీఛార్జ్‌ ఆఫర్స్ ను ప్రవేశపెడుతోంది జియో టెలికాం సంస్థ. ఇటీవల కాలంలో రీఛార్జ్‌ రేట్స్ పెంచడంతో.. యూజర్స్ సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో యూజర్స్ ను మళ్లీ  జియో వైపు తిప్పకునేందుకు కొత్త కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తున్నారు జియో అధినేత ముఖేష్ అంబానీ. 
 
ఇక ఇప్పుడు జియో తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం.. 3 నెలల సూపర్ హిట్  బ్లాక్ బస్టర్ ప్లాన్ ను తీసుకొచ్చింది. అయితే ఈ  ఆఫర్ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో  ఉంది. దీంతో జియో యూజర్స్ త్వరలో  ఈ ఆఫర్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ఒక యూజర్ ఈ రీ చార్జ్ ప్లాన్ ను ఎంచుకునేటప్పుడు.. వారు ఈ రీ చార్జ్ యొక్క ప్రయోజనాలను జాగ్రత్తగా చెక్ చేసుకొని.. MY JIO APP ద్వారా లేదంటే దగ్గర్లోని జియో స్టోర్ లో ఈ రీఛార్జ్ ప్లాన్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 3 మంత్స్,6 మంత్స్,లేదా 12 మంత్స్ ప్లాన్ ను జియో యూజర్స్  ఎలా ఎంచుకోవచ్చు.. ఈ ఆఫర్ ప్రత్యేకత ఏంటనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

ఈ ఆఫర్ లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే..
*EXTRA CHARGES లేకుండా EXTRA VALIDITY ఉండటం అతిపెద్ద ప్రయోజనం. 
*HIGH INTERNET SPEEDలో కూడా ఎలాంటి మార్పుల చేర్పులు  ఉండవు.
*ఎక్కువసేపు INTERNET యాక్సెస్ కోసం అదనంగా ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం  కూడా లేదు.
* OTT మరియు స్మార్ట్ హోమ్ యాక్సెస్ ప్రయోజనాలు అలాగే ఉంటాయి.
* తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది కూడా ఉండదు. 
* స్పీడ్ కూడా 30 Mbps నుండి 300 Mbps+ ఉంటుంది. 

ఇక దీని ప్రారంభ ధర రూ.399 (30 Mbps) నుండి ఉండనుంది. ఈ యేడాది ప్రారంభంలో  రిలయన్స్ జియో  రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తిరిగి ప్రారంభించింది. ఇప్పుడు రూ. 189కి ఉచిత వాయిస్ తో పాటు ఇతర డేటా ప్రయోజనాలతో సరసమైన ప్లాన్‌ను అందిస్తుంది. కొన్ని ఆన్‌లైన్ నివేదికల ప్రకారం.. జియో గతంలో రూ. 189 ప్యాకేజీని అందించింది. కానీ ఆ తర్వాత ఆ ప్యాకేజ్ ను నిలిపివేసింది.  అలాగే  రూ. 189 ప్రీపెయిడ్ ప్యాకేజీలో  28 రోజుల వ్యాలిడిటీతో పాటు 300 ఫ్రీ  SMSలు, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి. ఇది హై స్పీడ్ తో  2GB డేటాను అందిస్తుంది. తరువాత 64Kbps అపరిమిత డేటాను కూడా అందిస్తుంది. అంతేకాకుండా  JioTV, JioCinema, JioCloud సబ్ స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌తో పూర్తిగా ఉచితం. అయితే, JioCinema ప్రీమియం యాక్సెస్‌కు మాత్రం మద్దతు లేదు.

Also Read:  NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..

Also Read:  Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News