Swiggy Introduces Pyng AI Platform: ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్ స్విగ్గీ మరొ కొత్త రంగంలోకి ప్రవేశించింది. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ విభాగాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థ తాజాగా హెల్త్, వెల్ నెస్, ఆస్ట్రాలజర్, ఈవెంట్ ప్లానర్ వంటి ప్రొఫెషన్స్ తో కనెక్ట్ అయ్యేందుకు పింగ్ పేరుతో ఏఐ ఆధారిత ఫ్లాట్ ఫామ్ ను లాంచ్ చేసింది. ప్రొఫెషనల్ సర్వీస్ మార్కెట్ కు పెరుగుతున్న ఆదరణ ద్రుష్ట్యా దీన్ని తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.
ఆధునిక యుగంలో మన జీవితాలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ట్యాక్స్ ప్లానర్స్, యోగా ట్రైనర్స్ వంటి వారు మనకు అవసరం అవుతున్నారని స్విగ్గీ ఇన్నోవేషన్ హెడ్ సంస్థ సహా వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి తెలిపారు. ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రొఫెషనల్స్ తో కనెక్ట్ కావచ్చు అన్నారు. ప్రస్తుతానికి బెంగళూరు యూజర్లకు ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా 10వేల మందికి పైగా నిపుణులను చేర్చుకోవడమే లక్ష్యమని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫైనాన్షియల్ ట్రైనర్, యోగా ఇన్ స్ట్రక్టర్, న్యూట్రిషనలిస్టు, థెరపిస్టు, ఇన్వెస్ట్ మెంట్ కన్సల్టెంట్ , ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ , ట్రిప్ ప్లానర్, ట్రావెల్ అడ్వైజర్, మ్యూజిక్, డ్యాన్స్ కెరీర్ అడ్వైజరీ వంటి వ్రుత్తి నిపుణులు ఈ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంటారు.
Also Read: SBI: రుణగ్రహీతలకు ఎస్బిఐ భారీ శుభవార్త..తగ్గనున్న హోంలోన్ వడ్డీ రేట్లు
కాగా స్విగ్గీ షేర్లు బిఎస్‌ఇలో 1.17 శాతం పెరిగి రూ.337.1 వద్ద ట్రేడవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.38 గంటలకు ఈ షేర్లు 1.17 శాతం పెరిగాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









