China US Trade war: 'నీ బొంద మావా..' ట్రంప్ కి ఇండియా ఝలక్.. టారిఫ్ వార్ తో పంట పండింది పో

China US Trade war: అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల భారత్ కు ఎంతో మేలు జరిగే ఛాన్స్ ఉందని థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అమెరికా, చైనాపై 125శాతం మేర ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్ కు చెందిన వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు భాగా లాభపడతాయని రిపోర్టు పేర్కొంది. 

Written by - Bhoomi | Last Updated : Apr 11, 2025, 07:46 PM IST
China US Trade war: 'నీ బొంద మావా..' ట్రంప్ కి ఇండియా ఝలక్.. టారిఫ్ వార్ తో పంట పండింది పో

China US Trade war: అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల భారత్ కు ఎంతో మేలు జరిగే ఛాన్స్ ఉందని థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అమెరికా, చైనాపై 125శాతం మేర ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్ కు చెందిన వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు భాగా లాభపడతాయని రిపోర్టు పేర్కొంది.  అమెరికా మార్కెట్లో ఈ భారతీయ ఉత్పత్తులు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీ పడుతాయని తెలిపింది. 

Add Zee News as a Preferred Source

కాగా అమెరికా, చైనా వంటి  అగ్రదేశాల మధ్య జరుగుతున్న ఈ వాణిజ్య యుద్ధం నుంచి భారత్ లాభపడాలంటే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని జీటీఆర్ఐ సూచించింది. అమెరికా ఇచ్చిన 90 రోజుల రిలీఫ్ నుంచి లబ్దిపొందాలంటే భారత్ తన ఎక్స్ పోర్ట్ ఎకోసిస్టమ్ ను బలోపేతం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే అమెరికా కొనుగోలుదారులతో సరైన ఒప్పందాలు చేసుకోవాలంటూ సూచించింది. ఒకవేళ ఇలా చేయలేని పక్షంలో భారత్ కు కలిగే ప్రయోజనాలు కేవలం స్వల్పకాలికానికే పరిమితం అవుతాయని స్పష్టం చేసింది. 

ప్రభుత్వం చిన్న సంస్థలకు వర్కింగ్ క్యాపిటల్ కోసం చౌకగా లోన్స్ ఇవ్వాలని కస్టమ్స్ షిప్ మెంట్లను వేగవంతం చేసేలా ప్రోత్సహించాలని జీటీఆర్ఐ పేర్కొంది. దీనికోసం ప్రభుత్వం వడ్డీ ఈక్వలైజేషన్ స్కీమును తిరిగి ప్రవేశపెట్టాలని సూచించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈమధ్యే పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించారు. దీంతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడింది. దీంతో ఆయన చైనా మినహా మిగతా దేశాలకు 90రోజులపాటు రివెంజ్ టారిఫ్స్ నుంచి ఉపశమనం కల్పిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు. ఇది కచ్చితంగా భారత్ కు మేలు చేస్తుందని జీటఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. 

Also Read: Bank Interest Rates Cuts: గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు.. తక్కువ వడ్డీకే లోన్స్   

ట్రంప్ చైనా ఉత్పత్తులపై 125 శాతం వరకు అధిక సుంకాలు విధించారు. దీంతో అమెరికాకు ఎగుమతి అయ్యే చైనా వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతాయి. ఇదే సమయంలో భారత్ ఎగుమతులపై కేవలం 10 శాతం మాత్రమే సుంకాలు ఉన్నాయి. ఇది ఏప్రిల్ 2న విధించిన అమెరికా మార్కెట్లో చైనా ఉత్పత్తులతో భారత ఉత్పత్తులు నేరుగా పోటీ పడగలుగుతాయి. ముఖ్యంగా భారత్ కు చెందిన వస్త్రాలు, తోలు, ఇంజనీరి్ంగ్, ఎలక్ట్రానిక్  వస్తువులు బాగా లాభపడే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

భారత ఎగుమతిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీవాస్తవ సూచించారు. అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఏయే ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించారు. వేటికి మినహాయింపు ఇచ్చారు..ఏయే ఉత్పత్తులపై కొత్త సుంకాలు విధించారు..కస్టమ్స్ రూల్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని భారత ఎగుమతిదారులు జాగ్రత్తగా సమీక్షించుకోవాలని స్పష్టం చేశారు. ఇక ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం చూసినట్లయితే.. ఒక ఉత్పత్తిలో కనీసం 20శాతం అమెరికాలో తయారు చేసిన భాగాలు ఉన్నాయని మనం అనుకున్నట్లయితే..ఆ 20శాతం మినహాయించి మిగిలిన 80శాతంపై మాత్రమే పన్నులు విధిస్తారు. 

Also Read: Most Expensive Tomato In The World: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టొమాటో.. పూట కర్రీకి ఆస్తులు అమ్ముకోవాల్సిందే  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News