Tata Capital IPO: టాటా గ్రూప్ IPO అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు సంపాదించాలనుకునే వారికి గుడ్ న్యూస్. దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్‌కు చెందిన మరో కంపెనీ IPO త్వరలో రాబోతోంది. టాటా ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిటల్ తన IPO కోసం ప్రక్రియను ప్రారంభించింది. రూ. 15,000కోట్లు సమర్పించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి కాన్ఫిడెన్షియల్ ప్రీ ఫైలింగ్ రూట్లో డీహెచ్ఆర్ పీ సమర్పించింది. కొత్త షేర్ల జారీ, ఆఫర్ సేల్ పద్ధతిలో నిధుల సమీకరణ జరపాలని నిర్ణయం తీసుకుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా క్యాపిటల్ ను అప్పర్ లేయర్ గా ఎన్ బీఎఫ్ సీగా గుర్తించింది. దీంతో ఈ సంస్థ తప్పనిసరిగా 2025 సెప్టెంబర్ లోగా లిస్ట్ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం టాటా క్యాపిటల్ బోర్డు ఆమోదం పొందింది. 2.3కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో తేనుంది. ఇందుకోసం ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను తగ్గించుకోనున్నారు. ప్రస్తుత క్యాపిటల్ లో టాటా సన్స్ కు 93శాతం వాటా ఉంది.
సెబీ నుంచి ఆమోదం పొంది పబ్లిక్ ఇష్యూకు వస్తే ఫైనాన్షియల్ సెక్టార్ లో అతిపెద్ద ఐపీఓగా టాటా క్యాపిటల్ నిలుస్తుంది. టాటా గ్రూపు నుంచి ఇటీవల కాలంలో వస్తున్న రెండో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది నిలుస్తుంది. అంతకుముందు టాటా టెక్నాలజీస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదయ్యింది. 202-24 ఆర్థిక సంవత్సరంలో టాటా క్యాపిటల్ రూ. 18, 178కోట్ల ఆదాయాన్ని పొందింది. లోన్ బుక్ రూ. 1లక్ష కోట్లను దాటింది.
Also Read: Trump Tariff War: ట్రంప్ టారిఫ్ వార్‌పై కేంద్రం స్పెషల్ ఫోకస్.. నెక్ట్స్ ఏం జరగనుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









