Tata Motors Shares: టాటా గ్రూపునకు చెందిన టాటా మోటార్స్ షేర్లు సోమవారం కుప్పకూలాయి. ఉదయం సెషన్లోనే పది శాతం పతనమయ్యాయి. దీంతో రూ. 552.50కు క్షీణించాయి. మార్కెట్లు నష్టాల్లో ఉండటానికి తోడు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లను అమెరికాకు పంపించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించిన తర్వాత షేర్లు భారీ క్షీణత నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు ఈ స్టాక్ ను భారీగా విక్రయిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈమధ్యే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై 25శాతం టారిఫ్లును విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ సబ్సిడయరీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు షిప్ చేయాల్సిన కార్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ట్రంప్ టారిఫ్ల తర్వాత ఈ చర్యను తీసుకుంది. అయితే టాటా మోటార్స్ జేఎల్ఆర్ రెవెన్యూ ఎక్కువగా అమెరికా నుంచే ఉంటుంది. అక్కడికి షిప్ మెంట్ ఆగిపోతే ఆదాయం, లాభాలపై ప్రభావం పడుతుందని పెట్టుబడిదారులు ఆందోళనతో షేర్లను అమ్మేస్తున్నారు. దీంతో స్టాక్ ధర భారీగా క్షీణించింది.
అయితే టాటా మోటార్స్ షేర్లు ప్రస్తుతం కొంత రికవరీ సాధించాయి. స్వల్పంగా కోలుకుని 7.4శాతం నష్టంతో రూ. 568 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ స్టాక్ 52వారాల కనిష్ట స్థాయి రూ. 535 ఈ రోజే నమోదు అవ్వడం గమనార్హం. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 2.09 లక్షల కోట్లకు పడిపోయింది. జెఎల్ఆర్ ప్రీమియం కార్లను తయారు చేస్తుంది. జాగ్వార్లు, రేంజ్ రోవర్లు, డిఫెండర్లు అమెరికాకు ఎగుమతి చేస్తుంది. అక్కడ తయారీ కేంద్రం లేకపోవడంతో పూర్తిగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. 2024చివరి త్రైమాసికంలో అమెరికాకు 38,000 వాహనాలను ఎగుమతి చేసింది. ట్రంప్ టారిఫ్స్ పెంపు తర్వాత ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. తమ భాగస్వామ్య సంస్థలతో చర్చలు జరిపి తదుపరి కార్యచరణ ప్రకటించనున్నట్లు తెలిపింది.
మార్చి నెలలో టాటా మోటార్స్ దేశీయంగా 90,500యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. ఏడాది క్రితం ఇదే నెలలో 90, 822 యూనిట్లను సేల్ చేసింది. విక్రయాలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ తో కలిపి ప్యాసింజర్ సేల్స్ 3శాతం పెరిగి 51, 872 యూనిట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. కమర్షియల్ వెహికల్స్ సేల్స్ మాత్రం 3శాతం 41, 122 యూనిట్లకు పరిమితం అయ్యాయి.
2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తం సేల్స్ ను పరిశీలిస్తే 9,12,155 యూనిట్లు సేల్ అయ్యాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 9,48, 015 యూనిట్లతో పోల్చితే 4శాతం క్షీణత నమోదు అయ్యింది. ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ 3శాతం తగ్గి 5,56,263 యూనిట్లు సేల్ అయ్యాయి. కమర్షియల్ వెహికల్ సేల్స్ 5శాతం తగ్గి 3,76,903 యూనిట్లు సేల్ అయ్యాయి. ఇక ట్రెండ్ లైన్ డేటా ప్రకారం టాటా మోటార్స్ షేర్లు రాబోయే రోజుల్లో 37శాతం పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ రెవెన్యూ పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా శుక్రవారం కూడా టాటా మోటార్స్ షేర్లు 6శాతానికిపైగా తగ్గి రూ. 614స్థాయికి పడిపోయాయి.
Also Read: Lowest petrol price: రూ. 2కే ఒక లీటరు పెట్రోల్...ఈ ప్రాంతంలో డె*డ్ చీప్ రేట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









