Tata Harrier : టాటా హారియర్ ప్రియులకు శుభవార్త.. పెట్రోల్ వెర్షన్ లాంచ్ తేదీ వచ్చేసింది...!

Tata Harrier : టాటా మోటార్స్ గతేడాది చివరిలో తన పాపులర్ మిడ్ సైజ్ ఎస్ యూవీ హారియర్ కొత్త వెర్షన్ ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పెట్రోల్ వెర్షన్ లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ టాటా హారియర్ కారు 1.5-లీటర్, టర్బోచార్జ్డ్ TGDi ఇంజిన్‌తో పనిచేస్తుంది. అధునాతన సాంకేతికతతో కూడిన ఈ ఇంజిన్ లీటరుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని సులభంగా ఇవ్వగలదు.అయితే ఈ కారు లాంచ్ తేదీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Apr 13, 2025, 06:30 PM IST
Tata Harrier : టాటా హారియర్ ప్రియులకు శుభవార్త.. పెట్రోల్ వెర్షన్ లాంచ్ తేదీ వచ్చేసింది...!

Tata Harrier: భారత్ లో టాటా కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వినియోగదారులకు అభిరుచికి తగ్గట్టుగానే కంపెనీ  కూడా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తుంది. ఇప్పటికే టాటా మోటార్స్ పలు రకాల మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా టాటా హారియర్ పెట్రోల్ వెర్షన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.  ప్రస్తుతం ఈ కారు డీజిల్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవలే ఆటో ఎక్స్‌పోలో ఈ కారు EV వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. అయితే, EV మోడల్ ఇంకా లాంచ్ కాలేదు. టాటా హారియర్  పెట్రోల్ వేరియంట్ టెస్టింగ్  సమయంలో కనిపించింది. దీనితో కంపెనీ త్వరలో ఈ శక్తివంతమైన SUV పెట్రోల్ వెర్షన్‌ను విడుదల చేయవచ్చనే ఆశలు రేకెత్తాయి. అయితే, కంపెనీ నుండి ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం బహిర్గతం కాలేదు. 

Add Zee News as a Preferred Source

టాటా మోటార్స్ తన హారియర్, సఫారీ SUV లలో కొత్త 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ (TGDi) పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ శక్తివంతమైన పనితీరును అందించడమే కాకుండా ఆధునిక ప్రమాణాలను కూడా తీరుస్తుంది.

Also Read: Trump Tariffs: హమ్మయ్య.. ట్రంప్ వెనక్కి తగ్గాడు..సుంకాలు తగ్గించాడు.. దేనికంటే?  

ఇంజిన్ ఫీచర్లు:

ఇంజిన్ సామర్థ్యం (సిసి): 1.5 లీటర్లు, టర్బోచార్జ్డ్ TGDi

గరిష్ట శక్తి: 5000 rpm వద్ద 170 PS

గరిష్ట టార్క్: 2000 – 3500 rpm వద్ద 280 Nm

ఇంధనం: E20 ఇథనాల్-పెట్రోల్ మిశ్రమం 

నిబంధనలు: BS6 దశ II ఉద్గార నిబంధనలకు అనుగుణంగా

Also Read:  Mahindra: బంపర్ ఆఫర్ ప్రకటించిన మహీంద్రా అంకుల్.. ఆ మోడల్ కార్లపై 4లక్షల భారీ డిస్కౌంట్   

గేర్‌బాక్స్ ఎంపికలు: మాన్యువల్,  ఆటోమేటిక్

టాటా హారియర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 14 లక్షల నుండి ప్రారంభమవుతుందని అంచనా. ఈ కారు మహీంద్రా XUV700,  MG హెక్టర్‌లకు పోటీ పడే అవకాశం ఉంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News