Tata Motors: వినియోగదారులకు బిగ్ షాకిచ్చిన టాటా మోటార్స్..ఏప్రిల్ నుంచి ధరల పెంపు

Tata Motors: టాటా మోటార్స్ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2025 నుండి తన అన్ని వాణిజ్య వాహనాల ధరలను 2% వరకు పెంచవచ్చని కంపెనీ ప్రకటించింది. టాటా మోటార్స్ బాటలోనే మారుతీ కంపెనీ కూడా తన వాణిజ్య వాహనాలపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.   

Written by - Bhoomi | Last Updated : Mar 17, 2025, 09:19 PM IST
Tata Motors: వినియోగదారులకు బిగ్ షాకిచ్చిన టాటా మోటార్స్..ఏప్రిల్ నుంచి ధరల పెంపు

Tata Motors: భారత మార్కెట్లో అతిపెద్ద కార్ల అమ్మకాల కంపెనీలలో ఒకటైన టాటా మోటార్స్ తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1, 2025 నుండి తన అన్ని వాణిజ్య వాహనాల ధరలను 2శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు,  ఖరీదైన ముడి పదార్థాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ ధర పెరుగుదల అనేది పలు మోడల్స్, వేరియంట్స్ పై ఆధారపడి ఉంటుంది. 

Add Zee News as a Preferred Source

ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న తయారీ ఖర్చులు, ఖరీదైన ముడి పదార్థాలు, లాజిస్టిక్స్ ఖర్చుల కారణంగా ధరలను పెంచే చర్య తీసుకున్నట్లు వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తెలిపింది. అయితే, ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొంత భాగాన్ని కస్టమర్లకు కూడా బదిలీ చేయడం అవసరం అయిందని పేర్కొంది.

కాగా టాటా మోటార్స్ కంటే ముందే మారుతి సుజుకి కూడా వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.  కంపెనీ తన వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచుతుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు,  నిర్వహణ ఖర్చులు దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో, ఈ నెల ప్రారంభంలోనే కంపెనీ తన చౌకైన కారు ఆల్టో K10 ను ప్రామాణిక 6 ఎయిర్‌బ్యాగ్‌లతో లాంచ్  చేసింది. దీని అర్థం ఇప్పుడు ఆల్టో K10  అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల సౌకర్యం ఉంటుంది.

Also Read: ​IndusInd Bank Share Price: ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ల జోరు... RBI ప్రకటనతో 5శాతం పెరిగిన స్టాక్!  

ధరల పెరుగుదల రవాణా,  లాజిస్టిక్స్ రంగంపై ప్రత్యక్షంగా తీవ్ర  ప్రభావాన్ని చూపనుంది. ఎందుకంటే వాణిజ్య వాహనాలు ఖరీదైనవిగా మారడంతో, రవాణా ఖర్చు కూడా పెరగవచ్చు.  మారుతి, టాటాల పెరిగిన ధరలను చూసిన తర్వాత వినియోగదారులు కూడా తమ కొనుగోలు నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఇది ఇతర ఉత్పత్తుల ధరలను కూడా ప్రభావితం చేయవచ్చు.

Also Read: Ola Share Price: ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దివాలా తీయనుందా?  రూ.50 కంటే దిగువకు పడిపోయిన షేరు ధర..కారణం ఇదే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News