Tata Nano EV Car: ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ టాటా నానో కారు. ఒకప్పుడు సంచలనంగా మారిన ఈ కారుని తిరిగి లాంచ్ చేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమౌతోంది. ఈ కారు మార్కెట్‌లో రిలీజ్ అయితే కచ్చితంగా మరో సంచలనం కావచ్చని అంచనా. ఎందుకంటే ఈసారి ఇది ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుంది.
టాటా మోటార్స్‌కు చెందిన టాటా నానో కారు ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌తో ముందుకు రానుంది. మిగిలిన ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉండటమే కాకుండా ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గతంలో టాటా నానో విడుదలైనప్పుడు బాగా సంచలనం రేపినా డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తి ఆగిపోయింది. అందుకే ఆ పేరును మరోసారి పాపులర్ చేసేందుకు టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్ సిద్ధమౌతోంది. దేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్లను రంగంలో దింపిన కార్లలో టాటా మోటార్స్ పేరు ప్రముఖంగా చెప్పవచ్చు. ఇప్పటికే టాటా టియాగో, టాటా టిగోర్, టాటా నెక్సాన్ కార్లు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు టాటా నానో కూడా ఈవీ రూపంలో రానుంది.
టాటా నానో ఈవీ కారు చాలా ముఖ్యమైన అప్‌గ్రేడ్స్‌తో రానుంది. లోపల కేబిన్ ఫీచర్లు అద్భుతంగా ఉంటాయంటున్నారు. ఈ కారు చాలా తేలిగ్గా, సమర్ధవంతంగా ఉంటుందని అంచనా. ఒకసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 2008లో కేవలం లక్ష రూపాయల అతి తక్కువ ధరకు లాంచ్ అయిన ఈ కారు ఈవీ వెర్షన్ కూడా మిగిలిన ఈవీ కార్ల కంటే తక్కువ ధరకు లాంచ్ కావచ్చని తెలుస్తోంది. వచ్చే ఐదేళ్లలో టాటా నానో 10 కొత్త ఈవీ మోడల్స్ విడుదల చేయనుంది.
ఇక ధర గురించి మాట్లాడుకుంటే టాటా నానో ఈవీ చాలా తక్కువ ధరకే అందుబాటులో రావచ్చు. బేసిక్ మోడల్ 6 లక్షల నుంచి ప్రారంభమై హై ఎండ్ 9 లక్షల వరకు ఉండవచ్చు.
Also read: Pan Card Alert: బిగ్ అలర్ట్ ఇదే చివరి అవకాశం, లేకపోతే మీ పాన్‌కార్డు రద్దయిపోతుంది జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









