Tata Punch: 68 వేలు కడితే చాలు టాటా పంచ్ మీ సొంతం, ఎలాగంటే

Tata Punch: దేశంలో బెస్ట్ సెల్లర్ ఎస్‌యూవీగా నిలిచిన వాహనాల్లో ఒకటి టాటా పంచ్. అత్యధిక ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. తక్కువ డౌన్ పేమెంట్, సులభమైన ఈఎంఐలతో కారు సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 19, 2025, 07:03 PM IST
Tata Punch: 68 వేలు కడితే చాలు టాటా పంచ్ మీ సొంతం, ఎలాగంటే

Tata Punch: దేశంలో గత కొద్దికాలంగా టాటా వాహనాలు జోరు కన్పిస్తోంది. అటు పెట్రోల్-సీఎన్జీతో పాటు ఈవీ రంగంలో హల్‌చల్ సృష్టిస్తోంది. అదే విధంగా టాటా పంచ్ బెస్ట్ ఎస్‌‌యూవీగా నిలిచింది. తక్కువ ధరకే లభ్యమయ్యే ఎస్‌యూవీ ఇది. ఈ కారు ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఇండియాలో గత ఏడాది అంటే 2024లో అత్యధికంగా విక్రయమైన ఎస్‌యూవీ టాటా పంచ్. తక్కువ ధరకు లభిస్తుంది. అత్యధిక, అన్ని రకాల ఫీచర్లు ఉంటాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో టాటా పంచ్‌కు 5 స్టార్ రేటింగ్ దక్కింది. ఈ కారులో 7 ఇంచెస్ సెమీ డిజిటల్ క్లస్టర్ స్క్రీన్ ఉంటుంది. ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, వర్షాన్ని గుర్తించి పనిచేసే వైపర్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పుష్ బటన్ స్టార్ట్, స్టాప్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇక సేఫ్టీ పరంగా చూడాలంటే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబీఎస్, ఈబీడీ సిస్టమ్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియల్ పార్కింగ్ కెమేరా ఫీచర్లు ఉన్నాయి. మైలేజ్ కూడా లీటరుకు 18 కిలోమీటర్లు వస్తుంది. ఇందులో 1.2 లీటర్, 3 సిలెండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 

టాటా పంచ్ బేసిక్ మోడల్ ఆన్‌రోడ్ ధర దాదాపుగా 6,88,250 రూపాయలు ఉంది. బ్యాంక్ రుణం 6.2 లక్షల వరకు వస్తుంది. డౌన్ పేమెంట్ 68 వేలు కనీసం చెల్లిస్తే మిగిలినది 6 ఏళ్లు లేదా 7 ఏళ్లు లేదా 5 ఏళ్లు, లేదా 4 ఏళ్ల కాలవ్యవధికి రుణం తీసుకోవచ్చు. 9 శాతం వడ్డీ ఉంటుంది. 4 ఏళ్ల కాల వ్యవధికి నెలకు 16 వేల ఈఎంఐ ఉంటుంది. అదే ఐదేళ్లకు అయితే నెలకు 12, 900 రూపాయలు ఈఎంఐ చెల్లించాలి. ఆరేళ్ల కాల వ్యవధికైతే నెలకు 11,200 రూపాయలు ఉంటుంది. ఏడేళ్ల కాల వ్యవధికి నెలకు 10 వేలు ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. 

Also read: Karnataka: కర్ణాటక సంచలన నిర్ణయం, ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News