)
Telangana Govt Ties Up With 6 NGOs: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఐఐటి జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులను సమర్థం చేసేందుకు ప్రముఖ యంగ్ జీవులతో భాగస్వామ్యం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా చదువుతున్నారు. వీరికి పాఠశాల విద్యతోపాటు పోటీ పరీక్షలలో సన్నద్ధం అయ్యేందుకు నాణ్యమైన కోచింగ్ అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఆరు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆన్ లైన్ ద్వారా అటు ఆఫ్ లైన్ ద్వారా కూడా విద్యార్థులకు మంచి శిక్షణ అందిస్తున్నాయి.
EkStep ఫౌండేషన్ (నందన్ నీలేకణి ఆధ్వర్యంలో), ప్రజ్వల ఫౌండేషన్ (డా. సునితా కృష్ణన్). ఫిజిక్స్ వల్లా (అలక్ పాండే), ఖాన్ అకాడమీ, పై జామ్ ఫౌండేషన్ (శోయబ్ దార్), ఎడ్యుకేట్ గర్ల్స్ (సఫినా హుస్సేన్) వంటి 6 ఎన్జీవో సంస్థలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఒప్పందంపై మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతోనే తాము ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు, అనుగుణంగా విద్యా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.
ఈ ఒప్పందంలో భాగంగా EkStep Foundation ఇప్పటికే 540 పాఠశాలల్లో A.I. ఆధారిత ప్లాట్‌ఫామ్ ద్వారా పని చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో 5,000 ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. అలాగే Physics Wallah సంస్థ విద్యార్థులకు NEET, JEE, CLAT కోచింగ్ అందిందచేందుకు. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఈ ఒఫ్పందంలో భాగంగా ప్రముఖ ఎన్జీవో Khan Academy – 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు వీడియో ఆధారిత ట్రైనింగ్ ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ విషయాలపై అవగాహన కల్పిస్తోంది. అలాగే ఈ ఒఫ్పందంలో భాగంగా మరో ఎన్జీవో సంస్థ అయిన Pi Jam Foundation 1 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటర్ పైన శిక్షణ అందించనుంది.
ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా గ్రామీణ పేద విద్యార్థులు చదువుతున్న నేపథ్యంలో వీరికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అన్ని జిల్లాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్కూల్స్ సైతం ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook