)
Telangana Tops Digital Payments: ఫోన్ పే, గూగుల్ పే వంటి యూనిఫైడ్ ఆధారిత పేమెంట్స్ ఇంటర్ఫేస్ యాప్స్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలో ఈ సంవత్సరం జూలైలో ఎక్కువగా సంఖ్యలో తలసరి యూపీఐలు జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర జనాభాలో ఒక్కో వ్యక్తి ప్రతినెల సగటున 20.6 యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీని బట్టి తెలంగాణలో యూపీఐ యాప్స్ వినియోగం ఎంత పెరిగిందో ఇట్టే అర్థమయితుంది. ఇక ఇదే సమయంలో మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో వ్యక్తి ప్రతినెల సగటున 10 యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తలసరి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అతిపెద్ద సంఖ్యలో లేవని పరిశీలకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యూపీఐ ట్రాన్సాక్షన్ కంటే నగదు ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండడం మరో కారణమై ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తలసరి యూపీఐ ట్రాన్సాక్షన్ విషయంలో మనదేశంలో నెంబర్ వన్ స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉండగా.. అక్కడ ఒక వ్యక్తి ప్రతినెల సగటున 21.1 యూపీఐ ట్రాన్సషన్ చేస్తున్నారు. అయితే దేశంలోని మొత్తం యూపీఐ లావాదేవీల్లో 2.4శాతం ఢిల్లీలో జరుగుతున్నట్లు తేలింది. ప్రతినెల 20.6 తలసరి యూపీఐ ట్రాన్సాక్షన్స్ తో నెంబర్ 2 స్థానంలో తెలంగాణ ఉంది. మూడో స్థానంలో ఉన్న గోవాలో ప్రతి నెలా 19.2 తలసరి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అయితే దేశపు యుపిఐ ట్రాన్సాక్షన్ లో దీని వాటా 0.2 శాతమే ఉందని చెప్పవచ్చు.
దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో ప్రతినెలా జరుగుతున్న తలసరి యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంఖ్య 4.3 మాత్రమే ఉందని తేలింది. దేశపు యుపిఐ లావాదేవీల్లో 5.3శాతం అక్కడ జరుగుతున్నాయి. బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తలసరి యూపిఐ లావాదేవీల సంఖ్య ఐదు కంటే తక్కువగా ఉంది. దేశంలోని ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో నేటికీ నగదు ట్రాన్సాక్షన్స్ పెద్ద సంఖ్యలో జరుగుతున్నట్లు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. అక్కడి నగరాలు, పట్టణాల్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగానే జరుగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నగదు లావాదేవీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారని తేలింది.
ఈ సంవత్సరం జూలైలో మనదేశంలో జరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్ సంఖ్యను రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన విభజించి చూస్తే ..ఈ ఫలితాలు వచ్చాయి. జనాభాతో నిమిత్తం లేకుండా కేవలం యూపీఐ ప్రత్యక్ష సంఖ్యాపరంగా చూస్తే మరో విధమైన ర్యాంక్స్ వచ్చాయి. జూలై నెలలో మన దేశంలో అత్యధిక యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగిన రాష్ట్రం మహారాష్ట్రగా గుర్తించారు. నెల వ్యవధిలో భారత్ లో జరిగిన మొత్తం యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో 9.2శాతం వాట మహారాష్ట్రదే ఉంది. అక్కడి ఒక్కో వ్యక్తి సగటున 14.8 ట్రాన్సాక్షన్స్ చేశాడు. భారత యుపిఐ లావాదేవీల్లో 5.8శాతం వాటాను కర్ణాటక 4.7శాతం వాటాను తమిళనాడు అందించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి