Tesla sales down: అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్ తగిలింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో మస్క్ కు చెందిన కార్ల తయారీదారు సంస్థ టెస్లా విక్రయాలు 13శాతం మేర క్షీణించాయి. దీంతో మూడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 6శాతం మేర పతనం అయ్యాయి. అమెరికా రాజకీయాల్లో మస్క్ ఒక వర్గానికి కొమ్ము కాస్తుండడంతో పాటు పోటీ కంపెనీల నుంచి వస్తున్న కొత్త కొత్త మోడళ్ల వైపు వాహనదారులు మొగ్గు చూపుతుండటం విక్రయాలు పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది జనవరి , మార్చి త్రైమాసికంలో టెస్లా 3,86,810 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే విక్రయాలు తగ్గినా 3.72 లక్షల కార్లు అమ్ముడయ్యే అవకాశం ఉందన్న అంచనాలు సైతం వెల్లడయ్యాయి. వాస్తవంగా 3,36,681 యూనిట్లు మాత్రమే వెల్లడయ్యాయి. టెస్లా విక్రయాల విషయంలో గత ఏడాది మస్క్ మాట్లాడుతూ.. 2025తో 20 నుంచి 30 శాతం వ్రుద్ధిని నమోదు చేస్తామని పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు.
Also Read: Hyderabad Real Estate: వామ్మో.. ఇది అసలు ఊహించలేదు.. హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు ఢమాల్.. 3 నెలల్లో
దానికి విరుద్ధంగా క్షీణత నమోదు కావడం, మార్కెట్ అంచనాలకు ఏమాత్రం అందుకోకపోవడంతో కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఓ వైపు యూరప్, చైనా వంటి దేశాల్లో విద్యుత్ కార్లు కొనుగోలుకు జనం ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఆయా దేశాల్లో టెస్లా విక్రయాల్లో క్షీణత నమోదు కావడం ఆ కంపెనీకి ఆందోళన కలిగించే అంశమే. దీనికితోడు చైనాకు చెందిన బీవైడీ, యూరప్ కు చెందిన ఫోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూ నుంచిటెస్లాకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పటికే విద్యుత్ కార్ల విక్రయాల్లో టెస్లాను బీవైడీ దాటవేసినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.
Also Read: Stock Market: ట్రంప్ టారిఫ్ కు భయపడేదేలే..లాభాల్లో స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 450 పాయింట్లు జంప్
అమెరికా ప్రభుత్వ ఖర్చుల తగ్గింపు, మానవతా సాయం నిలిపివేత వంటి అంశాల్లో ఎలాన్ మస్క్ ట్రంప్ తో కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం కోల్పోయిన వేలాది మంది ఫెడరల్ వర్కర్లు, ఇతర వర్గాల ప్రజల్లో మస్క్ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దీనికితోడుగా టెస్లా నుంచి ఆశించిన స్థాయి మోడళ్లు రాకపోవడం కూడా మరో కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









