)
Caroline Leavitt: వైట్ హౌస్-బీజింగ్ మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతూన్న సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో ప్రతీకార సుంకాలు విధించినప్పటికీ నుంచి కొన్ని వస్తువుల దిగుమతిపైనా ఆంక్షలు విధించే స్థాయికి చేరుకుంది. ఈ సమయంలోనే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ధరించిన దుస్తువులు చర్చనీయాంశంగా మారాయి. అవి తమ దేశంలో తయారు చేసినవే అంటూ చైనీయులు వెక్కిరింపులకు దిగుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలోనూ పోస్టు చేస్తున్నారు. వీటిపై చైనాకు చెందిన ఓ దౌత్యవేత్త స్పందించారు. తమను నిందిస్తూనే తాము తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేయడం అమెరికాకు అలవాటేనంటూ ఎద్దేవ చేశారు.
కాగా అమెరికా అధ్యక్ష కార్యాలయం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ధరించిన ఓ డ్రెస్సుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. ఓ కార్యక్రమంలో ఆమె ధరించిన నల్లటి లేసుతో కూడిన ఎరుపు రంగు దుస్తులు చైనాలో తయారు అయ్యిందని పేర్కొంటూ చైనీయులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఇండోనేషియాలోని చైనా రాయబారి ఝూన్ ఝీషింగ్ స్పందించారు. ట్రంప్ యంత్రాంగం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. చైనాను నిందించండి. నిజజీవితంలో చైనాలో తయారైన వస్తువులు మాత్రం కొనండి అంటూ పేర్కొన్నారు.
#Election2025 #TariffWars #TrumpRecession Supreme Court 60 Minutes Security Clearance trend: Karoline Leavitt wears "Made in China". Many Trump goods were Made in China, his workers are often illegal immigrants, most of his wives are foreign, and his talking points are Russian.? pic.twitter.com/Hyl5WIHeq4
— It's Andy Fox ??? ????! Have a nice day! (@factandrumor) April 15, 2025
Trump press secretary Karoline Leavitt's dress made in China? Chinese envoy's claim as trade war intensifieshttps://t.co/IMgnZrGr04
— Economic Times (@EconomicTimes) April 15, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి