Ather Energy IPO subscription: నేటి నుంచి ప్రారంభం కానున్న ఎథర్ ఎనర్జీ ఐపీవో, ప్రైస్ బ్యాండ్ ధర ఎంత, మినిమం ఎన్ని షేర్లు కొనాలి

Ather Energy IPO subscription: ఈ సంవత్సరం తొలి మెయిన్ బోర్డ్ ఐపిఓ Ather Energy IPO subscription నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మూడు రోజుల పాటు సాగే ఈ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ ఏప్రిల్ 30వ తేదీన ముగియనుంది.   Ather Energy IPO  కోసం ప్రైజ్ బ్యాండ్ రూ. 304 నుండి రూ. 321 వరకు నిర్ణయించారు.  

Written by - Bhoomi | Last Updated : Apr 28, 2025, 06:16 PM IST
Ather Energy IPO subscription: నేటి నుంచి ప్రారంభం కానున్న ఎథర్ ఎనర్జీ ఐపీవో, ప్రైస్ బ్యాండ్  ధర ఎంత, మినిమం ఎన్ని షేర్లు కొనాలి

Ather Energy IPO subscription:  ఓలా ఎలక్ట్రిక్ బైక్ అనంతరం ఇప్పుడు మరో ఎలక్ట్రిక్  బైక్ కంపెనీ ఐపీఓ కోసం మార్కెట్లోకి ప్రవేశించింది. Ather Energy IPO subscription  ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 28 నుంచి మూడు రోజుల పాటు సాగి ఏప్రిల్ 30న ముగిసే  ఈ ఐపీఓ పరిమాణం రూ. 2,981 కోట్లుగా నిర్ణయించారు.  దేశంలోనే ప్రముఖ  ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీగా పేరు ఉన్నటువంటి Ather Energy  మార్కెట్లోకి ప్రవేశించేందుకు  ఐపీఓ ధరల ప్రైజ్ బ్యాండ్ ఇలా నిర్ణయించింది.  Ather Energy IPO  రూ. 304 నుండి రూ. 321 వరకు నిర్ణయించారు.

Add Zee News as a Preferred Source

Ather Energy IPO కోసం మినిమం ఎన్ని షేర్లు కొనుగోలు చేయాలి: పెట్టుబడిదారులు కనీసం 46 లాట్ సైజుతో దరఖాస్తు చేసుకోవచ్చు, కనీసం రూ. 13,984 పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఇష్యూ ధర బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 304–రూ. 321గా నిర్ణయించింది.

ఈ ఐపీవో  ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025- 2026) మొదటి మెయిన్‌బోర్డు పబ్లిక్ ఇష్యూ కావడం విశేషం. ఈ ఐపీవో ద్వారా మొత్తం రూ. 2,626 కోట్ల విలువైన తాజా షేర్లు, 1.1 కోట్ల షేర్ల OFS (Offer for Sale) ప్రాతి పాదికన విక్రయించనున్నారు. ఇందులో మొత్తం 75% - క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు (QIBs) కోసం, 15% - నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కోసం, అలాగే 10% - రిటైల్ ఇన్వెస్టర్లు కోసం కేటాయించనున్నారు. ఇక  GMP గ్రే మార్కెట్ ప్రీమియం విషయానికి వస్తే  ప్రస్తుతం Ather Energy షేర్లు గ్రే మార్కెట్లో రూ. 5 ప్రీమియంతో ట్రేడవుతున్నట్లు సమాచారం అందుతోంది.  ఇది ఏప్రిల్ 22న ఉన్న రూ. 40 వద్ద ఉన్నట్లు చూడొచ్చు. 

Also Read:  Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర... అక్షయ తృతీయ ముందే మహిళలకు గుడ్ న్యూస్... ఎంత తగ్గిందో తెలిస్తే పండగే  

IPO ద్వారా కంపెనీకి మొత్తం విలువ రూ. 11,956 కోట్లుగా తేలింది.  ఏప్రిల్ 26న, Ather Energy రూ. 1,340 కోట్లు Anchor Investors ద్వారా సమీకరించినట్లు తెలిపింది. ముఖ్యంగా ఇందులో ఉన్న యాంకర్ ఇన్వెస్టర్లలో కస్టడీ బ్యాంక్ ఆఫ్ జపాన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఈస్ట్‌స్ప్రింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, సొసైటీ జనరల్ వంటి సంస్థలు ముఖ్యంగా ఉన్నాయి. ఇక షేర్ల అలాట్ మెంట్ తేదీ , మే 2 శుక్రవారంగా నిర్ణయించారు. ఇక  లిస్టింగ్ తేదీ విషయానికి వస్తే,  మే 6, మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. Ather Energy IPO ద్వారా వచ్చే నిధులతో  కంపెనీ త్వరలోనే  మహారాష్ట్రలో కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టునుంది. అలాగే కంపెనీ తన రుణభారం తగ్గించడానికి వినియోగించనున్నట్లు తెలిసింది.

Also Read:  Patanjali Rose Sharbat: పతంజలి రోజ్  షర్బత్ .. రుచి, ఆరోగ్యం, దేశభక్తి మేళవింపు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News