Silver Growth: గోల్డ్ ను బీట్ చేసిన సిల్వర్.. 2024-25 షాకింగ్ ఫ్యాక్ట్స్

Silver Growth: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో వెండి రాబడులు బంగారాన్ని మించిపోతున్నాయి. అయితే ఏ మేరకు పెరిగాయి..ఎంత లాభపడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Apr 2, 2025, 08:58 PM IST
Silver Growth: గోల్డ్ ను బీట్ చేసిన సిల్వర్.. 2024-25 షాకింగ్ ఫ్యాక్ట్స్

Silver Growth: దేశంలో బంగారం ధరల గత కొన్నాళ్లుగా భారీగా పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ వెండి ధరలు గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.  ఎందుకంటే వెండి ధరలు ఇప్పుడు బంగారం కంటే ఎక్కువగా పెరుగుతుండడం విశేషం.  బంగారం ధరలు అదుపు లేకుండా పెరిగి తాజాగా 92,1050 రూపాయల వద్ద నిలిచాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా రికార్డ్ స్థాయిలో పెరిగి కిలోకి 1.03 లక్షలకు చేరుకుంది. అయితే ఇప్పుడు బంగారం ధర 99 వేల రూపాయలు వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు

Add Zee News as a Preferred Source

2024- 25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బంగారం ధర 31.37 రాబడిని ఇవ్వగా.. వెండి మాత్రం దానికి మించి 35.56% రాబడిని ఇచ్చింది. ఆర్థిక మార్కెట్లు ముఖ్యంగా నిఫ్టీ, సెన్సెక్స్ తరచుగా ఈ రాబడిని ఇచ్చినప్పటికీ బంగారం, వెండి ఇన్వెస్టర్లకు అధిక లాభాలను అందించడం విశేషం. ఈ క్రమంలోనే మీరు వెండి మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారా బంగారం కంటే ఎక్కువ లాభాన్ని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. మరికొన్ని రోజుల్లో వెండి ధరలు 1.25 లక్షల రూపాయలు దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.

గోల్డ్ మాన్  సాచ్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి పెద్ద బ్యాంకులు బంగారం ధర లక్ష్యాన్ని పెంచాయి. గోల్డ్ మాన్  సాచ్స్  2025 చివరిలో బంగారం ఔన్స్ 3,100 డాలర్ల నుంచి 3,300 డాలర్ల లక్ష్యాన్ని పెట్టింది.  బ్యాంక్ ఆఫ్ అమెరికా 2025లో బంగారం ఔన్స్ కు  $3,063, 2026 లో $3,350 లక్ష్యాన్ని సూచించింది. ఈ ప్రణాళికలు ప్రపంచ ఆర్థిక మార్పులకు అనుగుణంగానే మార్పు చేశారు.

Also Read: Stock Market: ట్రంప్ టారిఫ్ కు భయపడేదేలే..లాభాల్లో  స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్   450 పాయింట్లు జంప్   

 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో యూరోపియన్ యూనియన్ కెనడాపై వాహన దిగుమతి  సుంకాలు  విధించామని ప్రకటించినప్పుడు అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ చర్య వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులపై ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. దీంతోపాటు కేంద్ర బ్యాంకులు అనేక దేశాల మధ్య బంగారం కొనుగోళ్లను పెంచిన కారణంగా బంగారం ధర 8.2% పెరిగింది. ఇవన్నీ బంగారం, వెండి ధరలను అదుపు లేకుండా పెంచేశాయి. ఈ క్రమంలో భారత దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతుండడంతో మరింత ఆందోళన సృష్టిస్తున్నాయి.

 ముఖ్యంగా పండగల సమయంలో పెరిగిన ధరలు కేవలం సంపన్నులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అవాంతరాలను కలిగిస్తున్నాయి. వెండి, బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే పెరిగితే సామాన్య ప్రజలు వాటిని కొనడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే భవిష్యత్తులో కూడా వీటి ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Also Read:  Hyderabad Real Estate: వామ్మో.. ఇది అసలు ఊహించలేదు.. హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు ఢమాల్.. 3 నెలల్లో  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News