
Gold Rate: బంగారం ధరలు ఇప్పటికే ఒక లక్ష రూపాయలు దాటేయడంతో పసిడి ప్రియులకు ఆందోళన మొదలైంది. ముఖ్యంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 93 వేల రూపాయలు పలుకుతోంది ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు చేయించుకోవాలంటే చాలా కష్టతరంగా మారింది. అందులోనూ భారతీయులు వివాహ వేడుకల్లో బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు.
అలాగే అక్షయ తృతీయ ధన త్రయోదశి వంటి పండగల్లో తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది ఈ నేపథ్యంలో మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం చూసినట్లయితే ఒక తులం అంటే 10 గ్రాముల బంగారు చైన్ కొనుగోలు చేయాలంటే దాదాపు ఒక లక్ష పదివేల రూపాయల వరకు ఖర్చయ్య అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనిపైన జిఎస్టి, తరుగు, మేకింగ్ చార్జీలు వంటి ఇతర చార్జీలు అన్నీ కలిపి కూడా అదనంగా తోడై బంగారం ధర భారీగా పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో మీరు తక్కువ ధరలో బంగారం కొనుగోలు చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మేలిమి బంగారం అంటే 24 క్యారెట్ల బంగారంతో బంగారు ఆభరణాలు తయారు చేయరు. అందులో కొద్దిగా ఇతర లోహాలను కలిపి 22 క్యారెట్ల బంగారం గా తయారుచేసి ఆభరణాలు తయారు చేస్తుంటారు. అయితే ఇదే తరహాలో 18 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది ఇందులో 75% మేలిమి బంగారం, 25% ఇతర లోహాల మిశ్రమం ఉంటాయి. 18 క్యారెట్ల బంగారంతో కూడా బంగారు ఆభరణాలు తయారు చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఈ బంగారంతో రింగులు చెవి పోగులు గొలుసులు వంటివి తయారు చేసుకుంటారు. ఇది 22 క్యారెట్ల బంగారం కన్నా కూడా గట్టిగా ఉంటుంది. అయితే డైలీ వేర్ ఆభరణాల కోసం 18 క్యారెట్ల బంగారం సరిగా సరిపోతుంది. ముఖ్యంగా పురుషులు చేతి బ్రాస్లెట్స్, రింగులు ధరించడానికి 18 క్యారెట్ల బంగారం సరిపోతుంది. అయితే ఇది 22 క్యారెట్ల బంగారంతో పోల్చి చూస్తే కాస్త మెరుపు తక్కువగా ఉంటుంది.
ఎందుకంటే ఇందులో ఇతర లోహాలు ఎక్కువగా కలవడం వల్ల రంగు తగ్గుతుంది. అయితే మార్కెట్ ధరతో పోల్చి చూస్తే మాత్రం ప్రస్తుతం దీని ధర రూ. 73000 సమీపంలో ఉంది. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీ నగలను కొనుగోలు చేయాలని భావిస్తుంటారు వారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే 18 క్యారెట్ల బంగారాన్ని ప్రభుత్వ బ్యాంకులు గోల్డ్ లోన్ ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. కానీ ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సహా కొన్ని ప్రైవేటు బ్యాంకులో 18 క్యారెట్ల బంగారాన్ని కూడా తనఖా పెట్టుకుని రుణాలు అందిస్తుంటాయి.ఇందులో 75 % బంగారం ఉంటుంది కనుక ఆ బంగారానికి మాత్రమే విలువ కట్టి Loan to Value - LTV ప్రకారం రుణాన్ని అందిస్తారు. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇది ఒక మంచి ప్రత్యామ్నాయ మార్గంగా చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి