Gold Rate: బంగారం భారీగా పెరిగింది.. భవిష్యత్తులో తగ్గుతుందా? తులం రూ. 2లక్షలు అవుతుందా? ఈ యూరోపియన్ బ్యాంక్ ఏం చెప్పిందంటే?

Gold Rates: బంగారం ధరలు ప్రతిరోజు భారీగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే యూరప్ చెందిన ప్రముఖ UBS బ్యాంక్ బంగారం ధర పెరుగుదలపై ఓ అంచనా వేసింది బంగారం ధరలు ప్రస్తుతం ఉన్నటువంటి ధర నుంచి భార్య తగ్గే అవకాశం ఉందని అంద గల కారణాలను కూడా తెలిపింది.  

Written by - Bhoomi | Last Updated : Apr 14, 2025, 05:50 PM IST
Gold Rate: బంగారం భారీగా పెరిగింది.. భవిష్యత్తులో తగ్గుతుందా? తులం రూ. 2లక్షలు అవుతుందా? ఈ యూరోపియన్ బ్యాంక్ ఏం చెప్పిందంటే?

Gold Rates: బంగారం ధరలు ప్రతిరోజు భారీగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే యూరప్ చెందిన ప్రముఖ UBS బ్యాంక్ బంగారం ధర పెరుగుదలపై ఓ అంచనా వేసింది బంగారం ధరలు ప్రస్తుతం ఉన్నటువంటి ధర నుంచి భార్య తగ్గే అవకాశం ఉందని అంద గల కారణాలను కూడా తెలిపింది.

Add Zee News as a Preferred Source

బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితిలే అసలు కారణమని చెప్పవచ్చు. గడిచిన మూడు నెలలుగా బంగారం ధర భారీగా పెరిగిపోయింది. జనవరి ఒకటవ తేదీ నుంచి చూసినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80000 నుంచి 96,000వేల వరకు పెరిగిపోయింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగారం ధరలు  క్రమంగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మాంద్యం  వైపు వెళ్తున్నాయని సూచనలు రావడంతో స్టాక్ మార్కెట్లో కూడా కుప్పకూలుతున్నాయి. ఈ దెబ్బతో ముఖ్యంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించి అందులో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.

ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో ఉన్న 90 దేశాలపై దిగుమతి సుంకాలు వేయడంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లో పతనం ప్రారంభించింది. దీంతో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి బంగారం ధర రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. చరిత్రలో తొలిసారిగా బంగారం ధర 95000 రూపాయలను దాటింది. ఫలితంగా రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరగడంతో ఆ బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇబ్బందులుగా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా అమెరికా- చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం కారణంగా.. పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Also Read: Suzuki Hayabusa: యువతకు పిచ్చెక్కించే బైక్.. కొత్తకొత్తగా అదిరే ఫీచర్లతో హయబుసా..ధర ఎంతో తెలుసా?  

దీనికి తోడు బంగారం ఈటీఎఫ్ లలో పెట్టుబడులు పెద్దెత్తున పెరుగుతున్నాయి. ఫలితంగా బంగారం ధరలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధర  భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్విట్జర్లాండ్ కు  యుబీఎస్ బ్యాంక్ ఓ అంచనా విడుదల చేసింది. ఈ అంచనా ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ నాటికి బంగారం ధర ఒక ఔన్స్ ధర  3500డాలర్లకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది.  కేంద్ర బ్యాంకులో అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్లు కూడా బంగారం వైపు పెద్ద ఎత్తున ముగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని యుబిఎస్ స్ట్రాటజీ జోని టేబుల్స్ తెలిపారు.

అయితే బంగారు ధరలు పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే.. చైనా అమెరికా మధ్య వాణిజ్య వివాదాలతో పాటు అమెరికాను రెసిషన్ భయం వెంటాడుతుంది.  స్టాక్ మార్కెట్లను కుప్ప కూల్చుతున్నాయి. కేంద్ర బ్యాంకుల గోల్డ్ కొనుగోలు గోల్డ్ ఇటీఎఫ్స్ కు పెట్టుబడులు పెరగడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Also Read: Credit Card: మీ క్రెడిట్ కార్డును Google Payకి ఎలా లింక్ చేయాలి..ఇక్కడ ఇలా తెలుసుకోండి..!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News