Upcoming compact SUV: ఇండియన్ మార్కెట్లోకి రానున్న సరికొత్త SUVలు..ధర రూ.6లక్షలలోపే..వీటి ప్రత్యేకతలు ఇవే

Upcoming compact SUV: మీరు కొత్త కారు కొనేందుకు సెర్చ్ చేస్తున్నారా. అది కూడా మీ బడ్జెట్ లోపే ఉండాలనుకుంటున్నారా. అయితే  టాటా మోటార్స్,  రెనాల్ట్ రెండు కాంపాక్ట్ SUVలను విడుదల చేయబోతున్నాయి.వాటి ధర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Mar 9, 2025, 07:31 AM IST
Upcoming compact SUV: ఇండియన్ మార్కెట్లోకి రానున్న సరికొత్త SUVలు..ధర రూ.6లక్షలలోపే..వీటి ప్రత్యేకతలు ఇవే

Upcoming compact SUV: భారతదేశంలో నాలుగు మీటర్లలోపు లేదా కాంపాక్ట్ SUV కి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు హ్యాచ్‌బ్యాక్‌లు,  సెడాన్‌లను వదిలి ఈ విభాగంవైపు మళ్లీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  ఈ విభాగం చాలా పెద్ది కావడంతో ఇందులో చాలా కొత్త మోడళ్లు ఇంకా రాలేదు. టాటా మోటార్స్ తన పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువస్తుండగా, రెనాల్ట్ కిగర్  కొత్త మోడల్ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. ఈ రెండు వాహనాలు చాలా ప్రత్యేకమైనవి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

రెనాల్ట్ kiger ఫేస్ లిఫ్ట్:

రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఈ సంవత్సరం భారత కార్ల మార్కెట్లో విడుదల చేయవచ్చు. ప్రస్తుతం ఈ వెహికల్ టెస్టింగ్ లోఉంది. కానీ కిగర్ భారత్ లో అంతగా రాణించలేదు. అమ్మకాల విషయంలోనూ కంపెనీకి నిరాశే మిగుల్చింది.  కానీ కొత్త మోడల్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటుందని నమ్ముతారు. నివేదికల ప్రకారం, కొత్త కిగర్ ఫేస్‌లిఫ్ట్ ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ప్రస్తుత మోడల్ ధరతో పోలిస్తే, కొత్త మోడల్ ధర రూ. 10,000 నుండి రూ. 25,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, కిగర్ ధర రూ. 6.10 లక్షల నుండి రూ. 11.23 లక్షల వరకు ఉంది. ఇది 1.0L పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దీనిలో టర్బో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. భద్రత కోసం, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌ల సౌకర్యం ఉంటుంది.

Also Read: Fixed Deposit Interest Rate: SBI, PNB లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా...ఏ ప్రభుత్వ బ్యాంకు FD పై అత్యధిక వడ్డీని ఇస్తోంది?  

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్:

టాటా మోటార్స్ ఇప్పుడు దాని ప్రసిద్ధ కాంపాక్ట్ SUV పంచ్  ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను వేగంగా తీసుకువస్తోంది. ఈసారి కొత్త పంచ్‌లో చాలా పెద్ద మార్పులు చూడవచ్చు. నివేదికల ప్రకారం, కొత్త ఫేస్‌లిఫ్ట్ పంచ్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుత మోడల్‌లో 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది కొత్త మోడల్‌లో కూడా ఇన్‌స్టాల్ అవుతుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే, పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో 10.25 మీటర్ల కన్సోల్,  ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటో AC, క్రూయిజ్ కంట్రోల్,  సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. భద్రతా లక్షణాల కోసం, దీనికి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించవచ్చు. దీని ధర ప్రస్తుత మోడల్ కంటే రూ.20 వేల వరకు ఎక్కువగా ఉండవచ్చు. ఈసారి ఈ SUV కొన్ని పెద్ద మార్పులతో వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News