Stock Picks: మిరాయ్ అసెట్ షేర్‌ఖాన్ బ్రోకరేజ్ సంస్థ ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు హోల్డ్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి లాంగ్ టర్మ్ స్టాక్స్ రికమెండ్ చేసింది. ఈ స్టాక్స్ లో మీరు మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆయా కంపెనీల ఫండమెంటల్ ఆధారంగా వాటి బలమైన రిటర్న్స్ ఆధారంగా బ్రోకర్ అయితే సంస్థ వీటిని రికమెండ్ చేసింది. కనుక ఇన్వెస్టర్లు ఎవరైనా లాంగ్ టర్మ్ ఒకటి రెండు సంవత్సరాలు హోల్డ్ చేయగలిగితే ఈ స్టాక్స్ వైపు ఒకసారి చూడవచ్చు.
1. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో చక్కటి పర్ఫామెన్స్ కనిపిస్తోంది ముఖ్యంగా బ్యాంకు NPA (నాన్-పర్ఫార్మింగ్ ఆసెట్స్) మేనేజ్మెంట్, క్రెడిట్ గ్రోత్ స్థిరంగా మెరుగు పడుతున్న నేపథ్యంలో ఈ స్టాకు లాంగ్ టర్మ్ కోసం సిఫార్సు చేసింది.
ప్రస్తుత ధర: రూ. 103.36
టార్గెట్: రూ. 125
స్టాప్ లాస్: రూ. 95
2. JK లక్ష్మీ సిమెంట్
ఈ మధ్యకాలంలో ఇన్ఫ్రా రంగంలోనూ అదే విధంగా హౌసింగ్ సెక్టార్ లోను మంచి డిమాండ్ పెరిగింది దీంతో సిమెంట్ స్టాక్స్ చాలా లాభపడే అవకాశం ఉన్నట్లు బ్రోకరేజి సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో జెకె లక్ష్మీ సిమెంట్ చక్కటి ఫండమెంటల్ కలిగి ఉందని పేర్కొంది.
ప్రస్తుత ధర: రూ. 821.80
టార్గెట్: రూ.1,100
స్టాప్ లాస్: రూ. 740
3. Transport Corporation of India
రాబోయే కాలంలో లాజిస్టిక్స్ అదే విధంగా సప్లై సెక్టార్లో కీలకమైన అభివృద్ధి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మంచి డిమాండ్ ఉండే వీలుంది. అలాగే కంపెనీ ఫండమెంటల్ కూడా చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఈ కామర్స్ డిమాండ్ బలంగా ఉన్న నేపథ్యంలో బ్రోకరేజీ ఈ స్టాక్ రికమెండ్ చేసింది.
ప్రస్తుత ధర: రూ. 1,098
టార్గెట్: రూ. 1,400
స్టాప్ లాస్: రూ. 990
4. హిందుస్తాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (HCC)
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రారంగం పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలో హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ లాంటి కంపెనీలకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హెచ్ ఎస్ సి సి చక్కటి ఆర్డర్ కు కలిగి ఉంది.
ప్రస్తుత ధర: రూ. 28.11
టార్గెట్: రూ. 33
స్టాప్ లాస్: రూ. 25
5. PNB హౌసింగ్ ఫైనాన్స్
ఇటీవల హౌసింగ్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ఇళ్ళ కొనుగోలు చేసే వారికి మంచి అవకాశం గా మారిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ విభాగం చక్కటి రాబడి అందుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత ధర: రూ. 994.10
టార్గెట్: రూ. 1,057
స్టాప్ లాస్: రూ. 920
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. దీనిని స్టాక్ మార్కెట్ రికమండేషన్ గా భావించకూడదు. . జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎలాంటి స్టాక్ మార్కెట్ రికమండేషన్స్ అందించదు. పైన పేర్కొన్న స్టాక్స్ బ్రోకరేజీ సంస్థ అందించినవి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్కుతో కూడి ఉన్నవిగా ఉంటాయి. కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ సలహాదారుని సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









