)
Top Five Mid-Cap Mutual Funds: మీరు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలంటే నేరుగా స్టాక్ మార్కెట్లో అవగాహన లేకుండా దిగినట్లయితే పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎంపిక చేసుకొని అందులో పెట్టుబడి పెట్టాలి అంటే సరైన అవగాహన గైడెన్స్ అదే విధంగా పూర్తిగా రిస్క్ తీసుకునే ధైర్యం ఉండాలి. అప్పుడు మాత్రమే చక్కటి స్టాక్స్ ఎంపిక చేసుకొని రాబడి పొందే అవకాశం ఉంటుంది.
మీరు కనుక నేరుగా స్టాక్ మార్కెట్లోకి దిగినట్లయితే పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నష్టం వారి నుంచి తప్పించుకోవాలంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నది సరైన ప్రక్రియ అని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు లంప్సం మొత్తంలో ఒకేసారి కానీ, ప్రతి నెల చిన్న వాయిదాలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) రూపంలో కానీ పెట్టుబడి పెట్టవచ్చు. మీరు షేర్లు ఎంపిక చేయాల్సిన పని ఉండదు. .ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసిన షేర్లను ఒక ఫండ్ గా ఏర్పాటు చేసి మదుపుదారుల నుంచి పెట్టుబడి సేకరిస్తారు. ప్రస్తుతం మార్కెట్లోని ఐదు మిడ్ క్యాప్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మిడ్ క్యాప్ ఫండ్స్ లో రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ రాబడిన అందిస్తుంటాయి.
1. మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ : 2014లో ప్రారంభమైన ఈ ఫండ్ లో మొత్తం 26 షేర్లు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా కోఫోర్జ్, పర్సిస్టెంట్, కల్యాణ్ జువెల్లర్స్ షేర్లలోనే 55% డబ్బు ఇన్వెస్ట్ చేశారు. ఈ SIPల గత 10 ఏళ్లలో 23.7%, రాబడి అందిందిచింది.
2. ఎడెల్వీజ్ మిడ్ క్యాప్ ఫండ్: ఈ మిడ్ క్యాప్ ఫండ్ ప్రధానంగా స్మాల్ అలాగే మీడియం క్యాపిటల్ కలిగి ఉన్న కంపెనీలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టింది. ఇందులో మొత్తం 76 పైగా షేర్లు ఉన్నాయి. ప్రధానంగా ఐటి హెల్త్ కేర్ రంగాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. 10 ఏళ్ల SIPలో 23.4% రాబడి అందించింది.
3. ఇన్వెస్కో ఇండియా మిడ్‌క్యాప్ ఫండ్ : ఈ మిడ్ క్యాప్ ఫండ్ దాదాపు 46 కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఇందులో 20 శాతం పైగా ఫైనాన్స్ కంపెనీలో షేర్లు కొనుగోలు చేయగా. 17% పైగా హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడి పెట్టింది. SIPలో 23.2% రాబడి లభించింది.
4. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్: ఇది ఇన్వెస్టర్లకు పెద్ద ఎత్తున లాభాలను అందించింది.రిలయన్స్, అరబిందో వంటి సంస్థల్లో ప్రధానంగా పెట్టుబడులు పెట్టింది. 10 ఏళ్లలో సిప్ పై రాబడి 23.1% గా ఉంది.
5. నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్: ఇది ఇన్వెస్టర్లకు పెద్ద ఎత్తున లాభాలను అందించిన షేరుగా చెప్పవచ్చు. దాదాపు 95 షేర్లలో ఈ ఫండ్ పోర్ట్ ఫోలియో విస్తరించింది. ఫైనాన్స్, ఆటోమొబైల్, హెల్త్‌కేర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. అలాగేూ 10 ఏళ్లలో దాదాపు 22.7% SIP రాబడి అందించింది.
Disclaimer: స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు రిస్కుతో కూడినవి. పైన పేర్కొన్న సమాచారం కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. పెట్టుబడి సలహాగా ఎట్టి పరిస్థితుల్లో భావించకూడదు. జీ న్యూస్ తెలుగు వెబ్ పోర్టల్ ఎలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మీ పెట్టుబడులకు మీరే బాధ్యత వహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల కోసం నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి