)
Top 5 Defense stocks: భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని తుత్తునీయులు చేసింది. ఈ నేపథ్యంలో భారత సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. అయితే భారత్ గడచిన కొన్ని దశాబ్దాలుగా స్వశక్తితో రక్షణ రంగంలో రాణిస్తోంది. దీని వెనుక అనేక స్వదేశీ కంపెనీలు భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. అలాంటి కంపెనీలు అటు ఇన్వెస్టర్లను సైతం లాభాల బాటలోకి పరుగు పెట్టిస్తున్నాయి. గడచిన కొన్ని నెలలుగా డిఫెన్స్ స్టాక్స్ అవుట్ పెర్ఫార్మ్ చేయడం వెనుక భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తత నడుమ భారత్ సాధించిన పై చేయి కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పిఎల్ క్యాపిటల్ రీసెర్చ్ రికమెండ్ చేసిన 5 డిఫెన్స్ స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారత్ డైనమిక్స్ (BDL):
భారత రక్షణ రంగ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. భారత సైన్యానికి అనేక రకాలుగా బీడీఎల్ ఉపయోగపడుతోంది. రక్షణ పరికరాల తయారీలోనూ, అమ్యూనేషన్ తయారీలోనూ బిడిఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ స్టాకు కొనుగోలు చేయాల్సిందిగా బ్రోకరేజీ సంస్థ సిఫార్సు చేసింది.
ప్రస్తుత ధర: రూ. 1,586
టార్గెట్ ధర: రూ. 2,050
స్టాప్ లాస్: రూ. 1,450
అప్‌సైడ్: 29శాతం
గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ (GRSE)
భారత నౌకా దళానికి సేవలు అందించే సంస్థల్లో ముఖ్యమైనది ఈ సంస్థ. అటు నౌకాయానంతో పాటు మిలటరీ పరికరాల తయారీలో కూడా ఈ సంస్థకు ప్రవేశం ఉంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా గమనించినట్లయితే ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.
టార్గెట్ ధర: రూ. 3,300
స్టాప్ లాస్: రూ. 2,200
అప్‌సైడ్: 29శాతం
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ (HAL)
స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాలను తయారు చేయడం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రత్యేకత. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సంగ్రామంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ తయారు చేసిన యుద్ధ విమానాలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. పలు విదేశీ కంపెనీలతో సైతం చేతులు కలిపి హెచ్ఎఎల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. అటు ఇన్వెస్టర్లకు కూడా చక్కటి లాభాలను అందిస్తోంది. ఐపిఓ ప్రారంభం నుంచి కూడా చూసినట్లయితే ఈ స్టాకు మల్టీ బ్యాగర్ స్టాక్ గా చక్కటి లాభాలను అందించింది
ప్రస్తుత ధర: రూ. 4,483.55
టార్గెట్ ధర: రూ. 5,800
స్టాప్ లాస్: రూ. 4,000
అప్‌సైడ్: 30శాతం
మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ (MAZDOCK)
దేశంలోనే అత్యంత పురాతనమైన షిప్ బిల్డింగ్ తయారీలో నిమగ్నమై ఉన్న సంస్థ ఇదే కావడం విశేషం. ఈ స్టాక్ లిస్టింగ్ అయినప్పటి నుంచి కూడా ఇన్వెస్టర్లకు చక్కటి లాభాలను అందించింది. ప్రస్తుతం కూడా బ్రో కాలేజి సంస్థ మంచి టార్గెట్ అందించింది.
ప్రస్తుత ధర: రూ. 2,742.40
టార్గెట్ ధర: రూ. 3,800
స్టాప్ లాస్: రూ. 2,400
అప్‌సైడ్: 39శాతం
కొచ్చిన్ షిప్‌యార్డ్
ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ సంస్థ ఇన్వెస్టర్లకు గడచిన కొంతకాలంగా మంచి లాభాలను అందిస్తోంది. నౌకాదళానికి సంబంధించిన పరికరాల తయారీలోనూ నౌకల తయారీలోనూ నిమగ్నమై ఉన్న ఈ సంస్థ అటు ఇన్వెస్టర్లకు కూడా చక్కటి రిటర్న్స్ అందించింది. ఈ సంస్థ పేర్లను కొనుగోలు చేస్తే చక్కటి లాభాలను పొందే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ పేర్కొంది.
ప్రస్తుత ధర: రూ. 1,742.90
టార్గెట్ ధర: రూ. 2,300
స్టాప్ లాస్: రూ. 1,600
అప్‌సైడ్: 32శాతం
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook