Toyota Bz4x Price: స్పోర్ట్స్ కారు లుక్‌లో త్వరలో Toyota Bz4x.. అదిరిపోయిన ఫీచర్లు!
Toyota Bz4x Price & Specification: టొయోటా కంపెనీ స్పోర్ట్స్ కారు లుక్ లో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. ఈ కారు అధునాతన ఫీచర్లను కలిగి ఉండబోతోందని సమాచారం. ఈ కారు ఫీచర్లకు, ధర మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Toyota Bz4x Price and Specification: టయోటా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లలో మొట్టమొదటి ఈవీ కారును మార్కెట్లోకి విడుదల చేయబోతుంది. టొయోటా బిజెడ్ 4 ఎక్స్ పేరుతో ఎలక్ట్రిక్ కార్న్ వినియోగదారుల ముందుకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ కారు మార్కెట్లో ఉన్న ప్రధాన కార్లతో పోటీ పడబోతున్నట్లు సమాచారం. ఇక ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్లకు పైగా మైలేజీని ఇస్తుందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ కారు భారత మార్కెట్లో ఈ ధరల్లో లభించబోతుందో, ఫీచర్లు ఏమిటో మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
టొయోటా బిజెడ్ 4 ఎక్స్ కారులో చాలా రకాల కొత్త ఫీచర్లు లభించబోతున్నాయి. ఈ కారుకి కేవలం 40 నిమిషాల పాటు చార్జ్ చేస్తే 100% వరకు ఫిల్ అవుతుంది. దీంతో మీరు దాదాపు 500 కిలోమీటర్లు పైగా జర్నీ జర్నీ చేయవచ్చు. అంతేకాకుండా ఈ కారు ఏడు సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలిగే శక్తిని కలిగి కలిగి ఉంటుందని సమాచారం.
మీడియా నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు 218 హెచ్‌పి పవర్ తో పాటు 336 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన విడుదల తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఇక ధర విషయానికొస్తే.. పలు మీడియా నివేదికలు పేర్కొన్న ప్రకారం రూ.70 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభించబోతున్నట్లు సమాచారం.
Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..
అన్ని LED లైట్ సెటప్:
ఈ ఎలక్ట్రిక్ కారు వోల్వో XC40, కియా EV6, హ్యుందాయ్ ఐయోనిక్‌లకు పోటీగా రానుంది. టొయోటా బిజెడ్ 4 ఎక్స్ స్పోర్టీ లుక్ తో కంపెనీ వినియోగదారులకు పరిచయం చేయబోతోంది. కారులోని ఇంటీరియర్ లో భాగంగా ఆకర్షించేందుకు LED లైట్ సెటప్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అంతేకాకుండా టచ్ స్క్రీన్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఈ కారులో అందుబాటులో ఉంటుంది.
టొయోటా బిజెడ్ 4 ఎక్స్ ఇతర ఫీచర్లు:
✺ రేసింగ్ కార్ స్టైల్ లుక్
✺ ADAS వంటి భద్రత
✺ యాంబియంట్ లైటింగ్
✺ వైర్‌లెస్ ఛార్జర్
✺ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ
✺ ఆటోమేటిక్ AC
✺ సన్‌రూఫ్
Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి