)
Trump Policies Impact: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధానాలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తలనొప్పిగా మారాయి అని చెప్పవచ్చు. వీసా ఫీజుల పెంపు నుంచి విమాన ఛార్జీల పెరుగుదల వరకు ప్రతీ విషయంలోనూ ..ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఊహించని షాక్‌లు ఇస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌పై ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
తాజాగా హెచ్-1బీ వీసా రుసుము లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలు) పెంచే నిర్ణయం భారత టెకీలను కంగారు పెట్టింది. జీతమంతా వీసా ఫీజుకే వెళ్తుందేమో అన్న భయం వారిని వెంటాడుతోంది. కొందరు మనం డాలర్లు సంపాదించాలనుకున్నాం.. కానీ మొత్తం ట్రంప్‌కే వెళ్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాదు.. అమెరికా వెళ్లే విమాన టిక్కెట్ల ధరలు కూడా ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. పండుగల సీజన్లో బంగారం, వెండి రేట్లకూ రెక్కలు వచ్చాయి. ఒకవైపు వీసాలు, మరోవైపు మార్కెట్ షాక్‌లు .. ఇలా ట్రంప్ నిర్ణయాలు పాత చింతకాయ పచ్చడి మాదిరి ఉన్నాయని చెప్పవచ్చు . ఎందుకంటే అన్ని రకాల రుచులు కలిపి చివరికి తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ట్రంప్ విధానాలు కూడా అలాగే ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.
ఇదేం రోత రా ట్రంప్, కొత్త పాలసీ అంటే కొత్త ఇబ్బంది అన్నమాటేనా? అని ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ అయితే ట్రంప్ పాలసీలకు బలైనట్టే అని చెబుతున్నారు విశ్లేషకులు. హెచ్-1బీ వీసాలతో అమెరికా వెళ్లి కలలు కంటున్న టెకీలు ఇప్పుడు కలకంటున్నారా.. లేక నిద్రపోకుండా తల పట్టుకుంటున్నారా అనే స్థితికి చేరుకుంది. జీతమంతా వీసా ఫీజులకే పోతే, మిగిలేది కేవలం డాలర్ నోట్ల ఫొటోలు మాత్రమే అంటున్నారు.
అమెరికా మార్కెట్లు కూడా అలాగే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ట్రంప్ విధానాలు కొనసాగితే, అమెరికా ఆర్థిక మాంద్యానికి సిద్ధం కావాలని ఇప్పటికే మూడీస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రపంచ వాణిజ్యం గందరగోళం, ఇంధన ధరలు ఎగబాకడం, వలసల సమస్యలు పెరగడం ఇవన్నీ ట్రంప్ నిర్ణయాల సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పవచ్చు. పైగా పండుగ సీజన్ దగ్గరపడుతుండగా, బంగారం, వెండి ధరలకూ కూడా ట్రంప్ టచ్ తగిలింది. బంగారం కొనాలనుకునే వారికి ఒక్కసారిగా షాక్‌లు తగులుతున్నాయి. మొత్తానికి, ట్రంప్ పాలసీలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పాత చింతకాయ పచ్చడి మాదిరే.. రుచి చూడగానే కళ్ళల్లో నీళ్లు, మనసులో భయం కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.