Black Monday: బ్లాక్‌ మండే అంటే ఏంటి? 1987లో ఏం జరిగింది? ట్రంప్‌ దెబ్బకు మార్కెట్లు ఎందుకు వణికిపోతున్నాయి?

Stock market could crash like 1987: ప్రపంచంలోని వివిధ దేశాలపై డోనాల్డ్ ట్రంప్ విధించిన పరస్పర సుంకాల ప్రభావం భారతదేశంతో సహా యూరోపియన్, ఆసియా మార్కెట్లపై కనిపించింది. కరోనా కాలం తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్ కూడా అతిపెద్ద క్షీణతను చూసింది. మొత్తానికి ట్రంప్ ఎఫెక్ట్ అంతర్జాతీయ మార్కెట్లలో భారీ నష్టాల సునామీని క్రియేట్ చేసింది. అన్ని సూచీలు భారీగా పతనం అవుతున్నాయి. దీంతో 1987 బ్లాక్ మండే భయాలు పెట్టుబడిదారులను పీడిస్తున్నాయి. అసలీ బ్లాక్ మండే ఏంటి. మార్కెట్లు ఎందుకు వణికిపోతున్నాయో తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Apr 7, 2025, 11:24 AM IST
Black Monday: బ్లాక్‌ మండే అంటే ఏంటి? 1987లో ఏం జరిగింది? ట్రంప్‌ దెబ్బకు మార్కెట్లు ఎందుకు వణికిపోతున్నాయి?

Stock market could crash like 1987: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అన్ని దేశాలపై పరస్పర సుంకాలను విధించారు. ఇది ఆసియా నుండి అమెరికా మార్కెట్ల వరకు భయాందోళనలను సృష్టించింది. ట్రంప్ సుంకాల వ్యూహంపై వ్యతిరేకత కూడా పెరుగుతోంది. దీంతో ట్రంప్ కోరి కొరివితో తలగోక్కుంటున్నట్లు అవుతోంది. ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం దెబ్బకు సోమవారం ప్రపంచంలోని ప్రధాన సూచీల్లో ఒక్కటీ లాభాల్లో లేవంటే అతిశయోక్తి కాదు. దాదాపు 90దేశాలపై ట్రంప్ భారీగా ప్రతీకార పన్నులు విధించారు. దీంతో పెట్టుబడిదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఆసియాలోని జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్, తైవాన్, భారత్ ప్రధాన సూచీలు మొత్తం కనీసం 3 నుంచి 10శాతం లోపు నష్టాల్లో ఉన్నాయి. 

Add Zee News as a Preferred Source

అమెరికా మార్కెట్ వ్యాఖ్యాత, హార్వర్డ్ లా గ్రాడ్యుయేట్ అయిన జిమ్ క్రెమెర్ ఓ అడుగు ముందుకేసి 1987 బ్లాక్ మండే మళ్లీ పునరావ్రుతం అవుతుందని వ్యాఖ్యారించారు. దీంతో పెట్టుబడిదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రంప్ తక్షణమే చర్చలకు సిద్ధంగా ఉన్న దేశాలతో చర్చలు జరిపి ప్రతీకార పన్నులను తొలగించాలని కోరాడు. నిబంధనలు పాటించే కంపెనీలకు ఉపశమనం కల్పించకుంటే ఇప్పటికే మూడు రోజులు నష్టాల్లో ఉన్నాము. సోమవారం బ్లాక్ మండే పునరావ్రుతం కావచ్చని హెచ్చరించాడు. 

ప్రపంచవ్యాప్తంగా 1987 అక్టోబర్ 19ని బ్లాక్ మండేగా అభివర్ణించారు. ఆ ఒక్కరోజే అమెరికాలోని డోజోన్స్ ఇండిస్ట్రియల్ యావరేజ్ సూచీ ఏకంగా 22.6 శాతం పతనం అయ్యింది. మరోవైపు ఎస్ అండ్ పీ 500 సూచీ 30శాతం విలవు కోల్పోయింది. ఇది అక్కడితో ఆగిపోలేదు. ప్రపంచంలోని ఇతర మార్కెట్లపై దీని ప్రతికూల ప్రభావం పడింది. ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపా మార్కెట్లు విలవిలాడిపోయాయి. ఈ మార్కెట్ల పతనం దాదాపు నెల రోజులపాటు కొనసాగింది. ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లు ఈ సమయంలో 20శాతం విలువ కోల్పోయాయి. 

Also Read: Stock Market: కోవిడ్ తర్వాత మార్కెట్లో అతిపెద్ద విధ్వంసం.. స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే..సెన్సెక్స్ 3914, నిఫ్టీ 1146 పాయింట్లు డౌన్   

1987 స్టాక్ మార్కెట్ పతనం ఏదొక కారణంతో జరిగింది కాదు. చాలా అంశాలు దీనికి తోడు అయ్యాయి. బ్లాక్ మండేకు ముందువరకు బుల్ మార్కెట్ జోరు కనిపించింది. దీంతో 1982 నుంచి చూస్తే చాలా స్టాక్స్ విలువ మూడు రెట్లు అయ్యాయి. దీంతో అవి కరెక్షన్ కు గురయ్యాయి. 1987 బ్లాక్ మండే తర్వాత భవిష్యత్తులో ఇలాంటి పతనాలను నివారించేందుకు చాలా చర్యలు తీసుకున్నారు. వాటిల్లో సర్య్కూట్ బ్రేకర్లు ప్రవేశపెట్టడం కూడా ఉన్నాయి. 

అయితే ఏప్రిల్ 4వ తేదీన కోవిడ్ తర్వాత అతిపెద్ద పతనాన్ని అమెరికా మార్కెట్లు చవిచూడాల్సి వచ్చింది. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల సొమ్ము అవిరైయ్యింది. ఆదివారం డోజోన్స్ ఫ్యూచర్స్ 1405 పాయింట్లు పతనం అయ్యాయి. ఎస్ అండ్ పీ ఫ్యూచర్స్ 4.3శాతం, నాస్ డాగ్ 100 5.4 నష్టపోయాయి. నేటి నుంచి ఉదయం ఆసియా మార్కెట్లు ప్రారంభంలో జపాన్ నిక్కీ ఒక దశలో 8శాతం వరకు పతనం అయ్యింది. ప్రస్తుతం 6శాతం నష్టంతో ట్రేడ్ అవుతోంది. తైవాన్ సూచీ 9.61 శాతం, దక్షిణ కొరియా కోస్పి 4.14శాతం, చైనా షాంఘై సూచీ 6.5శాతం, ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ సూచీ 3.82 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News