)
Crash Pharma Stock Market: గురువారం రాత్రి డోనాల్డ్ ట్రంప్ ఔషధాలతో సహా అనేక రంగాలపై సుంకాలను ప్రకటించారు. ఔషధాలపై ప్రకటించిన 100శాతం సుంకం విధించడంతో దాని ఎఫెక్ట్ నేడు భారత స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. భారత స్టాక్ మార్కెట్ శుక్రువారం ఒత్తిడిలో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 412.67 పాయింట్లు తగ్గి 80,747.01కి చేరుకోగా, నిఫ్టీ 115 పాయింట్లు తగ్గి 24,776కి చేరుకుంది. అమెరికాకు గణనీయమైన ఎక్స్పోజర్ ఉన్న ఔషధ స్టాక్‌లు ఈరోజు పడిపోయాయి.
ట్రంప్ టారిఫ్ ప్రకటన తర్వాత అరబిందో, లుపిన్, డిఆర్ఎల్, సన్, బయోకాన్ సహా ఐదు భారతీయ ఫార్మా స్టాక్‌లు బాగా పడిపోయాయి. అరవిందో ఫార్మా 1.91 శాతం తగ్గి రూ. 1,076 వద్ద ట్రేడవుతోంది. లుపిన్ షేర్లు దాదాపు 3 శాతం తగ్గి రూ. 1,918.60 వద్ద ట్రేడవుతున్నాయి.
సన్ ఫార్మా షేర్లు దాదాపు 3.8 శాతం తగ్గి 1580 వద్ద ట్రేడవుతున్నాయి. సిప్లా షేర్లు 2 శాతం పడిపోయాయి. స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ 6 శాతం, నాట్కో ఫార్మా 5 శాతం, బయోకాన్ 4 శాతం, గ్లెన్ఫార్మా 3.7 శాతం, దివిలాబ్ 3 శాతం, ఐపీసీఏ ల్యాబ్స్ 2.5 శాతం, జైడస్ లైఫ్ 2 శాతం పడిపోయాయి. మ్యాన్‌కైండ్ ఫార్మా కూడా 3.30 శాతం పడిపోయింది. బిఎస్ఇలోని టాప్ 30 స్టాక్‌లలో, సన్ ఫార్మా అత్యధికంగా 3.8 శాతం క్షీణించింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఆసియన్ పెయింట్స్ సహా 25 స్టాక్‌లు 2 శాతం వరకు పడిపోయాయి. మిగిలిన ఐదు స్టాక్‌లు పెరిగాయి. ట్రంప్ టారిఫ్ ప్రకటన కారణంగా ఔషధ రంగం భారీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. 1.80శాతం నష్టపోయింది. ఇంకా H-1B వీసా సమస్యల కారణంగా, IT రంగం 1.30శాతం, ఆరోగ్య సంరక్షణ రంగం 1.50శాతం క్షీణించి ట్రేడవుతున్నాయి.
3,073 BSE స్టాక్‌లలో 864 లాభాలను ఆర్జించగా, 2,062 నష్టపోతున్నాయి. 147 స్టాక్‌లు ఎటువంటి చర్యను చూపించడం లేదు. 76 స్టాక్‌లు అప్పర్ సర్క్యూట్లో 65 స్టాక్‌లు లోయర్ సర్క్యూట్లో ఉన్నాయి. 88 స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయిలలో ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా ఈరోజు పెట్టుబడిదారులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు . BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్నటి రూ. 457 లక్షల కోట్లతో పోలిస్తే ఈరోజు రూ. 454 లక్షల కోట్లకు చేరుకుంది. దీని అర్థం పెట్టుబడిదారులు సుమారు రూ.3 లక్షల కోట్లు కోల్పోయారు.
కాగా అమెరికా అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ ఫార్మా పరిశ్రమ భారీ ఒడిదుడుకులు ఎదుర్కునే అవకాశం ఉంది. భారత ఫార్మా కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్ గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తంగా 27.9 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. దీనిలో 8.7బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు అమెరికాకే ఎగుమతి అయ్యాయి. అంటే మొత్తం ఎగుమతుల్లో ఇది 31శాతమని చెప్పుకోవచ్చు. అగ్రరాజ్యంలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45శాతం బయోసిమిలర్ ఔషధాల్లో 15శాతం మన దేశం నుంచి సరఫరా చేసినవే కావడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.