T. V. Sundram Iyengar Success Story: భారతదేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టీవీఎస్ గురించి తెలియని వారు అంటూ ఉండరు. భారత దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఇప్పుడు టీవీఎస్ ఒక బ్రాండ్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో టీవీఎస్ సంబంధించిన మోపెడ్లు, బైకులు పెద్ద మొత్తంలో అమ్ముడుపోతుంటాయి. టీవీఎస్ బ్రాండ్ గా మార్కెట్లోకి వచ్చిన చాంప్ నేటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది నడిపే వాహనంగా పేరు సంపాదించుకుంది. ఇంతటి ఘనమైన బ్రాండ్ ఉన్న టీవీఎస్ వ్యవస్థాపకులు ఎవరు దాదాపు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న టీవీఎస్ ను నడిపించిన శక్తి ఎవరు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీవీఎస్ అంటే ఏంటి అనే సందేహం చాలా మందికి కలగవచ్చు. అయితే ఇక్కడ టీవీఎస్ అంటే ఒక వ్యక్తి ఆయన ఒక శక్తిగా మారి నేడు వేలాది మందికి ఉపాధి వ్యాపార రంగంలో తిరుగులేని బ్రాండ్ గా గుర్తుండి పోయారు. అసలు టీవీఎస్ అంటే టి.వి. సుందరం అయ్యంగార్ ఆయనే ఈ సంస్థకు అంకురార్పణ చేశారు. మార్చి 22, 1877 వ తేదీన తిరుక్కురుంగుడి, తమిళనాడు జన్మించిన టీవీఎస్ అయ్యంగార్. ప్రారంభ ప్రారంభ వృత్తి న్యాయవాదిగా పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించారు. దీంతోపాటు ఇండియన్ రైల్వేస్ లో కూడా పనిచేశారు. ఈ వింధంగా ఆయన అటు బ్యాంకింగ్ ద్వారా పరిపాలన, వ్యవస్థలపై అవగాహన పెంచుకున్నారు. చివరకు 1911లో మధురైలో 'టి.వి. సుందరం అయ్యంగార్ & సన్స్ లిమిటెడ్' ప్రారంభించి వ్యాపార సామ్రాజానికి పునాది వేశారు.
తొలి వ్యాపారంగా మద్రాసు ప్రెసిడెన్సీలో బస్సు సర్వీస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. రోడ్డు రవాణా నుంచి ఆటోమొబైల్, ఫైనాన్స్, ఐటీ రంగాలకు టీవీఎస్ నేడు విస్తరించింది. ప్రస్తుతం TVS గ్రూప్ వార్షిక ఆదాయం రూ. 70,000 కోట్లు దాటగ, 60,000 మంది ఉద్యోగులు ఇందులో ఉపాధి పొందుతున్నారు.
టీవీ సుందర్ అయ్యంగార్ క్రమశిక్షణ, నూతన ఆవిష్కరణలు, సేవా ధర్మం మీద ఎక్కువగా ఆధారపడి వ్యాపారం చేశారు. ఆయన ప్రతికూల పరిస్థితుల్లో ఆవిష్కరణలకు తెరలేపారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చమురు కొరతను ముందుగానే గుర్తించి ఆయన TVS Gas Plant స్థాపించి చక్కటి లాభాలను పొందారు. అలాగే టైర్ రీట్రెడింగ్, ఆటోమొబైల్ సర్వీసింగ్ రంగాల్లో ప్రవేశించారు. అంతేకాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆటోమొబైల్ బ్రాండుగా ఉన్న General Motorsకి 'Madras Auto Service Ltd' పేరిట డిస్ట్రిబ్యూషన్ చేశారు. అంతేకాదు భారతదేశంలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్‌గా టీవీఎస్ అవతరించింది.
Also Read: Cars24 Lays Off: ఐపీఎల్‌లో, సొంత కంపెనీలో ధోనీకి కష్టాలు.. ఒక్కసారిగా 200 ఉద్యోగులను తొలగింపు
ఇక టీవీఎస్ తన కుటుంబాన్ని వ్యాపారంలోకి తీసుకొని వచ్చారు. ఇందులో భాగంగా తన ఐదుగురు కుమారులను వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చడంతో పాటు, కుటుంబంతో కలిసి వ్యాపారాన్ని విస్తరించడం, విలువలకు ప్రాధాన్యత ఇవ్వడంపైన ఎక్కువగా ఆయన దృష్టి పెట్టారు.
ఆయన ఒక సనాతన చాందస కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అభ్యుదయ భావాలను కలిగి ఉండేవారు. తన వితంతు కుమార్తె సౌందరంను తిరిగి పునర్వివాహం చేసుకునేందుకు ఆయన మద్దతు ఇచ్చారు. విద్య, సమానత్వం, సామాజిక అభ్యున్నతి పట్ల ఆయన ఎంతో నిబద్ధత చూపించారు. ఇక 1955లో ఆయన తుదిశ్వాస విడిచారు. 1956లో భారత ప్రభుత్వం మధురైలో ఆయని విగ్రహాన్ని ఆవిష్కరించింది. టి.వి. సుందరం అయ్యంగార్ స్థాపించిన TVS గ్రూప్ నేటికీ మన దేశ పారిశ్రామిక అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తోందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.