UPI Cash Withdrawal: డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకుండానే ATMలో క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?
UPI Cash Withdrawal: ప్రస్తుతం మార్కెట్లో ప్రతి ఒక్కరూ క్యాష్ లెస్ పేమెంట్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు యూపీఐ వాడకం పెరిగిన తర్వాత ATMలలో కూడా కార్డ్ లెస్ క్యాష్ ను పొందేందుకు అవకాశం ఉంది. అయితే కార్డు లేకుండానే యూపీఐ ద్వారా క్యాష్ విత్ డ్రా చేయడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
UPI Cash Withdrawal: సాధారణంగా ATM నుంచి డబ్బు విత్ డ్రా చేసేందుకు డెబిట్ కార్డ్ లేదా OTP ఆధారిత ఎంపికను ఉపయోగించుకోవచ్చు. కానీ, ప్రస్తుతం సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి UPI యాప్ సహాయంతో ATMల నుండి డబ్బు పొందవచ్చు. ఇప్పుడు UPI ద్వారా యాప్ ద్వారా కార్డ్ లెస్ క్యాష్ కు అవకాశం ఉంది.
అయితే UPI ద్వారా కార్డ్ లెస్ క్యాష్ సదుపాయాన్ని పొందేందుకు మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకుండానే ఇప్పుడు మీరు డబ్బును ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా విత్ డ్రా చేసుకునేందుకు మీరు వినియోగించే ఏటీఎంలో యూపీఐ విత్ డ్రాకు అనుమతి ఉండాలి. అదే విధంగా మీ ఫోన్ లో ఏదైనా యూపీఐ యాప్ లో నమోదు చేసుకోని ఉండాలి.
UPI ద్వారా మానిటైజేషన్..
UPI యాప్ సహాయంతో, మీరు డెబిట్ కార్డ్ లేకుండా ATMలో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
1. ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో Google Pay, PhonePe, Paytm, WhatsApp Pay, Amazon Pay వంటి UPI యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. ఈ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్‌లో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి.
3. ఇప్పుడు మీరు ATM కి వెళ్లి విత్ క్యాష్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు UPI ఆప్షన్ మీ ముందుకు వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
4. ఇప్పుడు మీ ఫోన్‌లో ఏదైనా UPI యాప్‌ని ఓపెన్ చేసి, QR కోడ్‌ని స్కాన్ చేయాలి.
5. దీని తర్వాత ATM నుండి డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు సదుపాయం ఉంది.
6. ఈ ఫీచర్ కింద మీరు 5 వేల రూపాయల కంటే ఎక్కువ పొందలేరు.
ALso Read: Goats on Rent: మేకలను అద్దెకు ఇవ్వబడును.. నెలకు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే వ్యాపారం!
Also Read: iPhone SE 3 Offers: రూ.29,900 ధరకే Apple iPhone SE 3 స్మార్ట్ ఫోన్ ను కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.