)
Moody's Sensational Report: అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం అంచున ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. వలసలపై కఠిన విధానాలు, విదేశీ వస్తువులపై టారిఫ్‌లు పెంపు, ప్రొటెక్షనిజం విధానాలు మొదలైనవి ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని... Moody’s Analytics చీఫ్ ఎకనమిస్ట్ మార్క్ జాండి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు 2007 ఆర్థిక మాంద్యం కంటే కూడా ప్రమాదకరంగా కొనసాగవచ్చు అని ఆయన హెచ్చరిస్తున్నారు.
ట్రంప్ పాలసీల కారణంగా అమెరికాలోని స్టాక్ మార్కెట్లు ఇప్పటికే తీవ్ర అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కంపెనీలు తమ పెట్టుబడులను వాయిదా వేసుకుంటున్నాయి. అంతేకాదు అమెరికాలో కొత్తగా ఉద్యోగాలను సృష్టించడం మరింత ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, సాఫ్ట్వేర్ రంగం, తయారీ రంగాలు మాంద్యపు తీవ్ర ప్రభావాన్ని మొదలుపెట్టిందని చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve) వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఇవి తాత్కాలిక ప్రభావం మాత్రమే చూపుతాయని.. మాంద్యాన్ని పూర్తిగా ఆపలేవు మూడీస్ తన రిపోర్టులో వెల్లడించింది.
Also Read: USA: ట్రంప్ దెబ్బ.. విమాన ఛార్జీలకు రెక్కలు..భారత్ నుంచి అమెరికాకు రెట్టింపు ఛార్జీలు..!!
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికాలో నిత్యావసరాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మూడీస్ తన రిపోర్టులో పేర్కొంది. అంతేకాదు అమెరికాలో నివసించే వారి రోజువారీ ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. ఫలితంగా వినియోగం తగ్గి పరిస్థితి ఏర్పడుతుంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా కేవలం అమెరికా మాత్రమే కాదు ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా భారత్, చైనా, యూరోప్ వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయి. ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలు పూర్తిగా గందరగోళ వాతావరణంలోకి నెట్టబడుతాయని మూడీస్ తెలిపింది.
ఒకవేళ మాంద్యం మొదలు అయినట్లయితే.. నిరుద్యోగుల సంఖ్య పెరగడంతోపాటు అది కొన్ని నెలలు కానీ సంవత్సరాలు కానీ కొనసాగే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులు కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చేందుకు వెనకాడుతారు. ఒకవైపు, సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. మరోవైపు కంపెనీల వ్యాపారాల్లో అనిశ్చితి పెరగడంతో.. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం లేకపోవటానికి కారణం అవుతుందని తెలిపింది.
మొత్తం మీద ట్రంప్ పాలసీలు అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యం వైపు నేరుగా కదిలిస్తున్నాయి. వీటి ప్రభావం గట్టి అమెరికా మార్కెట్లకు, వినియోగదారులపై, అంతర్జాతీయ వ్యాపారాలకు నేరుగా సంకేతం ఇచ్చాయి. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల వల్ల, రాబోయే నెలల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఖర్చులు, ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపించవచ్చని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.