US Tariffs: ప్రపంచంపై ట్రంప్ సుంకాల కొరడా...భారత్ పై ఎంత విధించిందంటే?

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ ఉత్పత్తులపై 26శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చైనాపై 34%, యూరోపియన్ యూనియన్‌పై 20%, జపాన్‌పై 24% సుంకాలు విధించారు. ఈ సుంకాలు పాక్షికంగా ప్రతీకార చర్య అని ట్రంప్ అన్నారు. వాణిజ్య అడ్డంకులపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.  

Written by - Bhoomi | Last Updated : Apr 3, 2025, 07:00 AM IST
US Tariffs: ప్రపంచంపై ట్రంప్ సుంకాల కొరడా...భారత్ పై ఎంత విధించిందంటే?

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుదేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలను వెల్లడించారు. ఈ రోజును ట్రంప్ లిబరేషన్ డేగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతోపాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. భారత్ ఉత్పత్తులపై 26శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చైనాపై 34%, యూరోపియన్ యూనియన్‌పై 20%, జపాన్‌పై 24% సుంకాలు విధించగా.. కొత్త టారిఫ్ ప్లాన్ ప్రకటన వచ్చిన వెంటనే అమల్లోకి వచ్చింది. ట్రంప్ ఈ సందర్భాన్ని "విముక్తి దినోత్సవం" అని తెలిపారు.  విధించిన సుంకాలు పూర్తిగా ప్రతీకార చర్య కాదని, పాక్షికంగా అలాంటివేనని ట్రంప్ అన్నారు.

Add Zee News as a Preferred Source

ప్రకటన సందర్భంగా ఆయన భారతదేశం, చైనా, UK,  యూరోపియన్ యూనియన్ సహా వివిధ దేశాలు విధించిన సుంకాలను చూపించే చార్ట్‌ను ప్రదర్శించారు. దీనితో పాటు ఈ దేశాలు ఎదుర్కోవాల్సిన కొత్త ప్రతీకార సుంకాలను కూడా వారు చూపించారు. ఈ చార్ట్ భారతదేశ సుంకాలలో 52% చూపిస్తుంది. ఇందులో "కరెన్సీ తారుమారు,  వాణిజ్య అడ్డంకులు" కూడా ఉన్నాయని ట్రంప్ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా, అమెరికా ఇప్పుడు 26% 'రాయితీ ప్రతీకార సుంకం' విధిస్తుంది.

Also Read:  Hyderabad Real Estate: వామ్మో.. ఇది అసలు ఊహించలేదు.. హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు ఢమాల్.. 3 నెలల్లో  

ట్రంప్ సుంకాలను వివరంగా వివరించారు. ట్రంప్ మాట్లాడుతూ, భారతదేశం చాలా కష్టతరమైన దేశం. భారత ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు. కానీ తాను అమెరికా సరిగ్గా ప్రవర్తించడం లేదని నాకు చెప్పారు.  52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ తెలిపారు. ఇక నుంచి చైనాపై 34 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాకు దిగుమతి అయ్యే అన్నిదేశాల ఉత్పత్తులపై కనీసం 10శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 

 

మోటార్ సైకిల్ సుంకాలలోని వ్యత్యాసాన్ని కూడా ట్రంప్ ఎత్తి చూపారు. ఇతర దేశాల మోటార్ సైకిళ్లపై అమెరికా 2.4% సుంకం మాత్రమే విధిస్తుందని ఆయన అన్నారు. థాయిలాండ్, ఇతర దేశాలు 60% వంటి చాలా ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నాయి. భారతదేశం 70%, వియత్నాం 75% వసూలు చేస్తుంది. ఇతర దేశాలు ఇంకా ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నాయని తెలిపారు. 

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా పరిశ్రమకు ఈ రోజు పునర్జన్మించినట్లు అయ్యింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండిపోతుంది. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. తమ టాక్స్ పేయర్లను గత 50ఏళ్లుగా దోచుకున్నారు. ఇక నుంచి అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాము. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. 

Also Read:  Hyderabad Real Estate: వామ్మో.. ఇది అసలు ఊహించలేదు.. హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు ఢమాల్.. 3 నెలల్లో  

ట్రంప్ ఈ దేశాలపై ఇంత ఎక్కువ సుంకాలు విధించారు :

వియత్నాం నుండి దిగుమతులపై 46 శాతం, స్విట్జర్లాండ్‌పై 31 శాతం, తైవాన్‌పై 32 శాతం, జపాన్‌పై 24 శాతం, బ్రిటన్‌పై 10 శాతం, బ్రెజిల్‌పై 10 శాతం, ఇండోనేషియాపై 32 శాతం, సింగపూర్‌పై 10 శాతం, దక్షిణాఫ్రికాపై 30 శాతం. విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్స్ పై 25 శాతం సుంకాన్ని విధించిన ఆయన, ఆటో విడిభాగాలపై కూడా అదే సుంకాన్ని ప్రకటించారు. ఆటోమొబైల్స్ పై కొత్త సుంకం ఏప్రిల్ 3 నుండి,  ఆటో విడిభాగాలపై మే 3 నుండి అమలులోకి వస్తుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News