Tariff war-Investors: ట్రంప్ టారిఫ్ వార్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లను కూడా ఊహించని స్థాయిలో తీవ్రంగా దెబ్బతీస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. అంతేకాదు ప్రపంచ ఆర్థిక వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. అమెరికా, చైనా ఈ రెండు అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రంగా మారుతుండటంతో భారత ఇన్వెస్టర్లు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు. ఏప్రిల్ మొదటి 15రోజుల్లో దేశీయ మార్కెట్ లో 11.3 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ దాదాపు 2శాతం మేర పడిపోయింది.
ఇక డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన భారీ దిగుమతి టారీఫ్స్ ప్రపంచ మార్కెట్లను వాష్ చేశాయి. మొదట అన్ని దేశాలపై సుంకాలపై విధిస్తామన్న ట్రంప్ తర్వాత 90రోజులు మినహాయింపులు ఇచ్చారు. కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం ప్రత్యేకంగా టార్గెట్ అయ్యింది. అమెరికా 145 శాతం దిగుమతి సుంకాలు విధించగా ..ప్రతీకారంగా చైనా 125 శాతం సుంకాలతో తిప్పికొట్టింది. ఈ తలనొప్పుల మధ్య అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులు వెనక్కి తీసుకోవడం ప్రారంభించడంతో మార్కెట్లు మరింత ఒత్తిడికి గురవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
భారత్ కు చైనా లేదా అగ్రరాజ్యంతో నేరుగా వాణిజ్య యుద్ధం లేకపోయినా ఇన్వెస్టర్ల భావోద్వేగాలను ఈ ఉద్రిక్తతలు ప్రభావితం అయ్యాయి. విదేశీ పెట్టుబడుల నిష్క్రమణ, పెరిగిన ముడి చమురు ధరలు రూపాయి విలువను దెబ్బతీశాయి. రూపాయి బలహీనంగా మారడం దిగుమతుల ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని తీసుకవచ్చింది.
భవిష్యత్తులో ఈ టారిఫ్ మరింత భయానకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. దిగుమతులపై ఆంక్షలు మరింత పెరగడం, వస్తువుల ధరలు పెరగడంతోపాటు ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ గ్రోత్ మందగమనం అవుతుందన్న అంచనాలుకూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని దేశాలు కలిసి వాణిజ్య తగాదాలను పరిష్కరించుకోవడం మంచిది. లేదంటే అభివ్రుద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









