Ex MP Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారిన సీనియర్ నాయకుడు విజయ్ సాయిరెడ్డి వైసీపీ అధినేతపై ఊహించని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయి ఇప్పుడు జగన్ కు దూరమయ్యారు. కేవలం దూరమవ్వడమే కాదు..తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ కలకలం రేపుతున్నాయి. జగన్ రాజకీయ శైలిలో మార్పులు వచ్చాయని..ఆయన చుట్టూ ఓ వర్గం ఏర్పడి పార్టీని పూర్తిగా నియంత్రిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మరోసారి జగన్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఓ కథను చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి.
విజయ సాయి రెడ్డి ఏమన్నారంటే... పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఆహా రాజా! ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్ళకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. కోటరీ కుట్రల్ని గమనించిన మహా రాజు, తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి! ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థంచేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు! ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటూ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Gold Vs Stock Market: బంగారం Vs స్టాక్ మార్కెట్.. ఎందులో పెట్టుబడి పెడితే లాభం ఎక్కువ..?
కాగా గత రెండు రోజులుగా జగన్ పై విజయసాయి రెడ్డి ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. తాను వైసీపీని వీడే ముందు జగన్ లండన్ లో ఉన్నారని అయినా కూడా తనను సంప్రదించినట్లు విజయ్ సాయి చెప్పారు. తన నిర్ణయం అప్పటికే ఖరారైందని స్పష్టం చేశారు. అంతేకాదన తనపై లంచాలఆరోపణలు చేయించారని..తాను అలాంటి వ్యక్తిని కాదని జగన్ కే చెప్పినట్లుఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి పూర్తిగాతప్పుకుంటానని తాను బలమైన నిర్ణయం తీసుకున్నానని..మళ్లీ ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశంలేదని తేల్చి చెప్పారు విజయ్ సాయి రెడ్డి. జగన్ చుట్టూ కోటరీ పెరిగిపోయి..పార్టీ పరిపాలన పూర్తిగా మారిపోయిందని..ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పార్టీకి నిబద్ధతతో పనిచేసిన తనలాంటి వ్యక్తికి సరైన గౌరవం దక్కలేదని తన మనసు విరిగిపోయిందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అయితే విజయ్ సాయిరెడ్డి చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేడెక్కిన తరుణంలో జగన్ పై ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
Also Read: Home Loan: హోంలోన్ తీసుకున్న వారికి శుభవార్త చెప్పిన ఆర్బిఐ..పూర్తి వివరాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









