)
VW 24 Inch TV Price: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇప్పుడు స్మార్ట్ టీవీలపై ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో VW బ్రాండ్ కు చెందిన 24 అంగుళాల స్మార్ట్ టీవీని ఇప్పుడు సగం ధర కంటే తక్కువ రేటుకు విక్రయానికి ఉంచారు. అయితే ఈ స్మార్ట్ టీవీ ఎంత ధరకు కొనుగోలు చేయోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వీడబ్ల్యూ Vision World 24 అంగుళాల స్మార్ట్ టీవీని ఇప్పుడు అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టీవీని మార్కెట్లో రూ.16,999 అసలు ధరకు విక్రయిస్తున్నారు. కానీ, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో ఈ స్మార్ట్‌టీవీని కేవలం రూ.5,999 ధరకే అందుబాటులో ఉంచారు. కానీ, దీనిపై మరింత తగ్గింపుతో ఈ టీవీని ఇంటికి తీసుకెళ్లొచ్చు అదెలాగో తెలుసుకుందాం.
ఈ టీవీ కొనుగోలు సమయంలో మీరు మార్కెట్లో దొరికే కొన్ని క్రెడిట్ కార్డులను వినియోగించడం ద్వారా మీరు గరిష్టంగా రూ. 1,500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 4,499 కు చేరుతుంది. అయితే దీనిపై మరింత తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.
విజన్ వరల్డ్ స్మార్ట్ టీవీని కొనే సమయంలో మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మీ పాత టీవీని ఎక్ఛ్సేంజ్ ద్వారా మరికొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ద్వారా మీరు గరిష్టంగా రూ. 2,150 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ టీవీ ధర రూ. 3 వేలకు చేరుతుంది. ఈ విధంగా ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ.3 వేలకే ఇంటికి తీసుకెళ్లొచ్చు.
వీడబ్ల్యూ Vision World స్మార్ట్ టీవీ ఫీచర్స్..
ఇప్పుడీ స్మార్ట్ టీవీకి సంబంధించిన ఫీచర్ల వివరాలను తెలుసుకుందాం. ఈ 24-అంగుళాల స్మార్ట్ టీవీ 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వచ్చింది. అదనంగా ఇందులో LED డిస్ప్లే టెక్నాలజీ, 60 Hz రిఫ్రెష్ రేట్‌తో మృదువైన విజువల్స్‌ను అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్స్ సపోర్ట్ తో ఈ టీవీ అమ్మకానికి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook