Successful Life: మీరు ఎప్పుడైనా ఢిల్లీ నగరాన్ని సందర్శించినట్లయితే..అక్కడ స్ట్రీట్ ఫుడ్ మీకు దర్శనమిస్తుంది. ఎన్నో రకాల వంటకాలు అక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రతి వీధిలోనూ వెరైటీ వెరైటీ ఫుడ్ మీకు స్వాగతం పలుకుతుంది. అక్కడ ఒక్కసారి స్ట్రీట్ ఫుడ్ రుచి చూస్తే తినకుండా ఉండలేరు. అందుకే దేశ రాజధాని ఢిల్లీ వైవిధ్య మైన వంటకాలు ప్రసిద్ధి చెందింది. వీధుల్లో నుంచి ఘుమఘుమలు రారమ్మని పిలుస్తుంటాయి. స్ట్రీట్ ఫుడ్ లో చోలే బదూరే చాలా ఫేమ్. ఈ రుచికరమైన వంటకాన్ని సీతారాం, దివాన్ చంద్ దంపతులు వడ్డిస్తున్నారు. ఈ రుచికరమైన వంటకం ఢిల్లీ వాసులనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను దోచుకుంది.
1955లో, సీతారాం, దివాన్ చంద్ పహార్‌గంజ్ DAV స్కూల్ ముందు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. వేడి వేడిగా ఉండే.. రుచికరమైన చోళే పట్టూర్‌ను అమ్ముతుండేవారు. వాళ్ళు స్కూలు ముందు సైకిళ్ళు పార్క్ చేసి స్కూలు పిల్లలకు చోలే పట్టూర్ అమ్ముతుండేవారు. ఈ విధంగా వారిద్దరూ 15 సంవత్సరాలపాటు సైకిల్ పై చోళే పట్టూర్ ను అమ్మారు. దీంతో క్రమంగా వారి వంటకం చాలా ఫేమస్ అయ్యింది. చోళే పట్టూర్ కాస్త "షోలే భదూరే"గా బాగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత ఇద్దరూ ఇంపీరియల్ సినిమా హాల్ ఎదురుగా ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించారు. ఇది వారి వ్యాపారానికి ఊతం ఇచ్చింది. సినిమాకి వచ్చే చాలా మంది ఈ చోళే పట్టూర్ కొనుక్కోవడానికి, తినడానికి దుకాణం ముందు క్యూ కట్టేవారు. ఇంకా, ఈ ప్రాంతం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండటం వల్ల వాణిజ్య కేంద్రంగా ఉద్భవించింది.చిన్న సైకిల్ పై ప్రారంభించిన ఈ వ్యాపారం ఇప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకుంది.
ఆ తర్వాత, ఎక్కువ మంది సీతారాం, దివాన్ చంద్ చోలే భట్టూర్ తినడం ప్రారంభించారు. ఆ తర్వాత 2008లో, సీతారాం, దివాన్ చంద్ ల మనవరాళ్ళు రాజీవ్ కోహ్లీ, ఉత్సవ్ కోహ్లీ, పితంపుర, పాసిమ్ విహార్, గురుగ్రామ్‌లలో కొత్త శాఖలను ప్రారంభించడం ద్వారా వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
ఇప్పుడు, పునీత్ కోహ్లీ నాయకత్వంలో, వ్యాపారం డిజిటల్ యుగంలోకి ప్రవేశించింది. మరింత మంది కస్టమర్లను, భోజన ప్రియులను చేరుకోవడం. కొత్త శాఖ ద్వారా ఈ రుచి వివిధ ప్రాంతాలకు చేరుకోవడమే కాకుండా, భోజన ప్రియుల సంఖ్య గణనీయంగా పెరిగి, ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
Also Read: Supreme Court: క్రిమినల్ రాజకీయ నేతలకు కేంద్రం నుంచి రిలీఫ్, ఆరేళ్లు చాలని అఫిడవిట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









