
Best Specialization In MBA: డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ చేయాలని అనుకుంటున్నారా. అయితే ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుందన్న విషయంలో చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. ఎంబీఏ కోర్సుకు సంబంధించిన నిపుణులు చెప్పిన సలహాలు, సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంబీఏలో ఉన్న అన్ని స్పెషలైజేషన్లు ఉపయోగకరంగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే విద్యార్థి అభిరుచి, ఆసక్తిని బట్టి తగిన స్పెషలైజేషన్స్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ ఆసక్తి, గత ఉద్యోగానుభవాలూ, ఏ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారనే అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులపై మంచి పట్టు ఉన్నట్లయితే బిజినెస్ అనలిటికల్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆపరేషన్స్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నట్లయితే మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకోవాలి. ఫైనాన్స్ పై ఇంట్రెస్ట్ ఉంటే ఫైనాన్స్, బ్యాంకింగ్ స్పెషలైజేషన్ ఎంచుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పై ఇంట్రెస్ట్ ఉంటే అంత్రప్రెన్యూర్ షిప్ స్పెషలైజేషన్ సెలక్ట్ చేసుకోవచ్చు. హ్యుమన్ రిసోర్స్ రంగంపై ఇంట్రెస్ట్ ఉంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ వంటి స్పెషలైజేషన్లు ఎంపిక చేసుకోవాలి.
ఎలాంటి ఉద్యోగం లేనివాళ్లు, ఉద్యోగానుభవం లేనివాళ్లు ఆన్ లైన్లో ఎంబీఏ కోర్సు చేస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండవు. వీలుంటే మీరు బీఎస్సీ డిగ్రీ విద్యార్హతతో కనీసం రెండేళ్లు ఉద్యోగం చేసి, ఆన్ లైన్ విధానంలో ఎంబీఏ చేయాలి. అలా వీలుకానీ పక్షంలో క్యాట్ వంటి జాతీయ ప్రవేశ పరీక్ష రాసి అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఎంబీఏను రెగ్యులర్ గా చదివేందుకు ప్రయత్నం చేయాలి. ఎంబీఏతోపాటు స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులూ చేసుకోవచ్చు. మెరుగైన ఉపాధి అవకాశాలు పొందాలంటే డిగ్రీలతోపాటు స్కీల్స్ కూడా ముఖ్యమే.
ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటే రెండు డిగ్రీలు రెగ్యులర్ చదివి ఉండాలన్న రూల్ అంటూ ఏదీ లేదు. జాతీయ విద్యావిధానం 2020ప్రకారం రెగ్యులర్, ఓపెన్ యూనివర్సిటీ, దూరవిద్య, ఆన్ లైన్ విధానాల్లో పొందిన అన్ని రకాల డిగ్రీలు సమానంగానే ఉంటాయి. వీటి గుర్తింపు విషయంలో ఎలాంటి భేదాలు ఉండవు. కానీ ఇంటర్వ్యూలున్న కొన్ని బోధన ఉద్యోగాల విషయంలో రెండు డిగ్రీలూ దూరవిద్య ఆన్ లైన్ లో చదవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవల్సి వచ్చే అవకాశం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.