
Gold Rate: భారతదేశంలో బంగారం కేవలం పెట్టుబడి సాధనం మాత్రమే కాదు.. ఒక సంప్రదాయ పరమైన ఆస్తి. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలు అన్నింటికీ బంగారం తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే ప్రతిరోజూ బంగారం ధరల్లో వచ్చే మార్పులు ప్రజల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంటాయి. కానీ బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు? ఒక వ్యక్తి లేదా కంపెనీ అనుకోవడం తప్పు. వాస్తవానికి ఇది అనేక అంశాల సమ్మేళనం అని చెప్పవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) రోజుకు రెండు సార్లు ప్రకటిస్తుంది. అదే సమయంలో భారతదేశంలో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ఉదయం, మధ్యాహ్నం ధరలను నిర్ణయిస్తుంది. ఈ ధరలు రూపాయి, డాలర్ మారకం రేటు, దిగుమతి సుంకాలు, జీఎస్టీ, స్థానిక డిమాండ్, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఆధారంగా మారుతూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా తన బంగారు నిల్వల ద్వారా ధరలపై పరోక్ష ప్రభావం చూపుతుంది.
ఇప్పుడు స్పాట్ రేటు అంటే ఏమిటో చూద్దాం:
స్పాట్ రేటు అనేది ప్రస్తుత మార్కెట్లో బంగారం కొనుగోలు లేదా అమ్మకం జరిగే ధర. ఇది ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ధర కాదు. COMEX (చికాగో), LBMA (లండన్), MCX (ముంబై) వంటి గ్లోబల్ ఎక్స్ఛేంజీలలో ఈ స్పాట్ రేట్లు నిర్ణయిస్తాయి. బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాలు డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గిపోవడం, రూపాయి బలహీనపడడం, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు అని చెబుతుంటారు. ఉదాహరణకు, ఒక ఔన్సు బంగారం గ్లోబల్ మార్కెట్లో $2,000 ఉంటే, భారతదేశంలో రూపాయి మారకం రేటు, దిగుమతి సుంకాలు, జీఎస్టీ కలిపి 10 గ్రాముల ధర రూ.60,000 చేరవచ్చు.
MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్:
ఇది భారతదేశంలో అతిపెద్ద కమోడిటీ ఎక్స్ఛేంజ్. ముంబై కేంద్రంగా ఉంది. ఇక్కడ బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్, వ్యవసాయ ఉత్పత్తులు వంటి అనేక వస్తువుల ట్రేడింగ్ జరుగుతుంది. MCXలో బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టుల రూపంలో వ్యాపారం చేస్తారు. అంటే భవిష్యత్ ధరకు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం. ఇందులో గోల్డ్ (1 కిలో), గోల్డ్ మినీ (100 గ్రాములు), గోల్డ్ గినియా (8 గ్రాములు), గోల్డ్ పేటల్ (1 గ్రాము) వంటి కాంట్రాక్టులు అందుబాటులో ఉన్నాయి. MCXలో ట్రేడింగ్ సమయం ఉదయం 9 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఉంటుంది. ఇక్కడ పెట్టుబడిదారులు స్పెక్యులేషన్ కూడా చేస్తారు. కానీ రిస్క్ ఎక్కువగానే ఉంటుంది.
బులియన్ మార్కెట్ :
బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు వ్యాపారం జరిగే స్థలం. భారతదేశంలో ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఓవర్ ది కౌంటర్ (OTC), మరొకటి ఫ్యూచర్స్ మార్కెట్. ఇందులో ఆర్బిఐ, బులియన్ బ్యాంకులు, ఆభరణాల వ్యాపారులు, పెద్ద పెట్టుబడిదారులు భాగస్వాములు అవుతారు. వివాహాలు, పండుగల సమయంలో స్థానిక డిమాండ్ ఎక్కువగా ఉంటే ధర పెరుగుతుంది. అదే సమయంలో దిగుమతి సుంకం (15శాతం) జీఎస్టీ (3శాతం) ధరను మరింత పెంచుతాయి.
బంగారం ధరలను ఎవరో ఒకరు నిర్ణయించరు. ఇది ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, రూపాయి, డాలర్ విలువ, డిమాండ్ , సరఫరా, ప్రభుత్వ విధానాలు, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు అన్నింటి కలయిక అని చెప్పవచ్చు. స్పాట్ రేటు ప్రస్తుత ధరను చూపిస్తే, MCX ఫ్యూచర్స్ మార్కెట్ వేదికగా ఉంటుంది. బులియన్ మార్కెట్ మొత్తం బంగారం వ్యాపారం జరిగే కేంద్రంగా ఉంది.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.