No GST On Alcohol: ఆల్కహాల్ కు జీఎస్టీ ఎందుకు వర్తించదు? సిగరెట్లకు మాత్రమే 40శాతం పన్ను ఎందుకు? అసలు కారణం ఇదే..!!

Why Liquor Not Under GST: సిగరెట్లపై కేంద్రం జీఎస్టీ 40శాతానికి పెంచింది. లగ్జరీ వస్తువులకు కూడా ఇదే పన్ను వర్తిస్తుంది. అయితే అల్కాహాల్ పై మాత్రం జీఎస్టీ వర్తించదు. ఇది జీఎస్టీ విధించే వస్తువుల జాబితాలోనే ఉండదన్న సంగతి తెలుసా? మరి లిక్కర్ పై ట్యాక్స్ ఎలా విధిస్తారు? జీఎస్టీ పరిధిలోకి లిక్కర్ ఎందుకు రాదు. ప్రస్తుతం ఆల్కహాల్ పై ఎంత శాతం పన్నులు అమలు అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Written by - Bhoomi | Last Updated : Sep 4, 2025, 10:03 PM IST
No GST On Alcohol: ఆల్కహాల్ కు జీఎస్టీ ఎందుకు వర్తించదు? సిగరెట్లకు మాత్రమే  40శాతం  పన్ను ఎందుకు? అసలు కారణం ఇదే..!!

Why Liquor Not Under GST:  కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, లగ్జరీ వస్తువులపై జీఎస్టీని 40 శాతం వరకు పెంచింది. ఈ పెంచిన పన్నులు సెప్టెంబర్ 22 నుంచి ఇది అమల్లోకి రానున్నాయి. అయితే ఇక్క గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.  అదేంటంటే.. ఆల్కహాల్ లేదా లిక్కర్ మాత్రం జీఎస్టీ జాబితాలోకి రాలేదు. ఎందుకనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి ఎందుకు మద్యం జీఎస్టీ పరిధిలోకి రాదు? సిగరెట్లపై 40శాతం జీఎస్టీని ఎందుకు విధించారు.  ప్రస్తుతం ఎలా పన్నులు విధిస్తున్నారు?  పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 366 (12A) ప్రకారం, ఆల్కహాల్‌ను జీఎస్టీ జాబితాలో చేర్చలేదు. అంటే మద్యం పన్నుల విధించే అధికారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా లిక్కర్‌ను జీఎస్టీలోకి చేర్చదు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఎక్సైజ్ సుంకం, వాల్యూ యాడెడ్ టాక్స్ (VAT), లైసెన్స్ ఫీజులు, అదనపు సెస్ లేదా సర్ ఛార్జీలు విధించి భారీ ఆదాయం సంపాదిస్తున్నాయి.

చాలా రాష్ట్రాల్లో ఆల్కహాల్‌పై పన్ను భారమే ఎక్కువగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో మద్యం ధరలో సుమారు 60 శాతం వరకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇది జీఎస్టీలో ఉన్న అత్యధిక శ్లాబ్ కంటే కూడా ఎక్కువ అని చెప్పవచ్చు. ఉదాహరణకు, బాటిల్ ధరలో ఒక మూడో వంతు మద్యం విలువ అయితే, మిగతా భాగం పన్నులు, లైసెన్స్ ఫీజులు, సర్ ఛార్జీలే అవుతాయి. అందుకే ప్రతి రాష్ట్రంలో మద్యం ధరలు వేరుగా ఉంటాయి.

ఆల్కహాల్‌పై జీఎస్టీ లేకపోయినా, దానికి సంబంధించిన ఇన్‌పుట్ సేవలపై మాత్రం జీఎస్టీ అమలవుతోంది. ఉదాహరణకు, బాటిళ్లు, ప్యాకేజింగ్ సర్వీసులు, రవాణా ఖర్చులు, లాజిస్టిక్స్, ప్రకటనలు, మార్కెటింగ్ సేవలపై జీఎస్టీ చెల్లించాలి. కానీ వీటిపై ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ప్రయోజనం మద్యం కంపెనీలకు ఉండదు. అంటే వారు చెల్లించిన జీఎస్టీని తిరిగి క్లెయిమ్ చేసుకోలేరు.

Also Read: Gold Rate: బంగారు నగలు షోరూంలో కొంటే మంచిదా? గోల్డ్ స్మీత్ దగ్గర చేయించుకుంటే మంచిదా? జర క్లారిటీ ఇవ్వక్కా..!!  

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, లిక్కర్‌పై పన్నులు విధించే పూర్తి అధికారం రాష్ట్రాలకే ఉండటంతో, ఏ రాష్ట్రం మద్యం నిషేధించాలని అనుకున్నా అది కూడా సాధ్యమే. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలకు మద్యం విక్రయాలు ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా ఉంటాయి. అందుకే ఆల్కహాల్‌పై జీఎస్టీకి బదులుగా రాష్ట్ర పన్నులే కొనసాగుతున్నాయి.

 జీఎస్టీ కింద లగ్జరీ వస్తువులు, సిగరెట్లు వంటి సిన్ గూడ్స్‌పై అధిక పన్ను విధించినా, లిక్కర్ మాత్రం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉండటంతో, పన్నులు భిన్నంగా ఉండటం సహజం. ఒక బాటిల్ మద్యం కొన్నప్పుడు మనం చెల్లించే డబ్బులో పెద్ద భాగం పన్నులే అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Also Read: 8th Pay Commission: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ద్రవ్యోల్బణం ఆధారంగా ఈసారి జీతాలు ఎంత పెరుగుతాయో తెలుసా?  

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News