Silver Price: గోల్డ్‌ కాదు.. పెట్టుబడిదారుల మొదటి ఎంపిక సిల్వర్.. కారణాలు ఇవే!

Silver ETF: బంగారంతోపాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు వెండిలో పెట్టుబడి పెట్టినట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. అయితే వెండిలో ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం. వెండిలో పెట్టుబడి పెట్టాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి. ఎంత లాభం ఉంటుంది. గడిచిన 25ఏళ్లలో ఎంత లాభం వచ్చిందన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Mar 9, 2025, 06:36 PM IST
Silver Price: గోల్డ్‌ కాదు.. పెట్టుబడిదారుల మొదటి ఎంపిక సిల్వర్.. కారణాలు ఇవే!

Silver ETF: బంగారం ధర పెరుగుదలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. ఇప్పటికే రూ. 90వేల మార్క్ దాటేందుకు సిద్ధంగా ఉంది. ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకేసింది. అయితే బంగారంతోపాటు వెండి కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా వెండి ధర ఏడాది రూ. 1,10, 000దాటి ఆల్ టైం రికార్డు స్థాయిని తాకింది. కొన్నిబ్రోకరేజ్ సంస్థలు కిలో వెండి ధర త్వరలోనే రూ. 1.50లక్షల అవుతుందని అంచనా వేస్తున్నారు. వెండిలో పెట్టుబడి పెట్టేందుకు కేవలం ఫిజికల్ వెండి వస్తువుల కొంటే సరిపోతుందా లేదంటే డిజిటల్ రూపంలో వెండిలో ఇన్వెస్ట్ చేయవచ్చా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

ప్రపంచవ్యాప్త అనిశ్చితుల మధ్య, వెండి కూడా పెట్టుబడిదారులను పెట్టుబడి కోసం ఆకర్షిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇది దాదాపు 11 శాతం రాబడిని ఇచ్చింది. రాబోయే రెండు-మూడు సంవత్సరాలలో రాబడి పరంగా వెండి పనితీరు మెరుగ్గా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. బంగారంతో పోలిస్తే వెండిలో ఎక్కువ హెచ్చుతగ్గులు ఉంటాయని నిపుణులు కూడా అంటున్నారు. దీనికి కారణం ఈ లోహాన్ని పరిశ్రమలలో అలాగే పెట్టుబడి ఆస్తిగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇది బంగారం కంటే సరసమైనది. చిన్న పెట్టుబడిదారులు కొనుగోలు చేయడం సులభం చేస్తుంది.

అయితే గడిచిన 25ఏళ్లలో వెండి ధర భారీగా పెరిగింది. సరిగ్గా 2000వ సంవత్సరంలో వెండి ధర కేజీ కేవలం రూ. 8వేలు మాత్రమే ఉండేది. అలాంటిది 2025 సంవత్సరానికి రూ. 1,10, 000 దాటేసింది వెండి దాదాపు 1400శాతం పెరిగింది. ఈ రేంజులో భారత్ సెన్సెక్స్ 1700శాతం పెరిగింది. అయితే సెన్సెక్స్ సూచితో పోల్చి చూస్తే వెండి ధర స్థిరంగా పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం సెన్సెక్స్ సూచిలో ఎంపిక చేసిన స్టాక్స్ కొనుగోలు చేసినప్పుడు ఆ స్టాక్స్ పెరుగుదల సెన్సెక్స్ సూచీతో విభిన్నంగా ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వెండి స్థిరంగా తన పెట్టుబడిదారులకు మంచి రాబడి అందించింది. 

అయితే వెండిలో రెండు రకాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. ఒకటి ఫిజికల్ రూపంలో కొనుగోలు  చేసి పెట్టుబడి పెట్టాలి. రెండవది డిజిటల్ రూపంలో అంటే సిల్వర్ ఈటీఎఫ్ రూపంలో బాండ్లను కొనుగోలు చేసి వెండిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ రెండు విధానాల గురించి తెలుసుకుందాం. 

Also Read: Fixed Deposit Interest Rate: SBI, PNB లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా...ఏ ప్రభుత్వ బ్యాంకు FD పై అత్యధిక వడ్డీని ఇస్తోంది?  

ఫిజికల్ రూపంలో అంటే వెండిని వస్తువుల రూపంలో కొనుగోలు చేయవచ్చు. అయితే ఆభరణాలు అదేవిధంగా వెండి వస్తువులు తయారు చేయించినప్పుడు అందులో తరుగు, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. 

బంగారం తరహాలోనే సిల్వర్ లో కూడా మీరు ఎక్స్చేండ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు వెండి యూనిట్లను కొనుగోలు చేసి వాటి ధర పెరిగినప్పుడు విక్రయించినట్లయితే మంచి లాభం పొందవచ్చు. వీటిని స్టాక్ మార్కెట్లో షేర్ల మాదిరిగానే ట్రేడింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. 

Also Read: Upcoming compact SUV: ఇండియన్ మార్కెట్లోకి రానున్న సరికొత్త SUVలు..ధర రూ.6లక్షలలోపే..వీటి ప్రత్యేకతలు ఇవే  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News