Patanjali Yoga Foundation: యోగా అనేది మానవ జీవితంలో భాగమైతే ప్రశాంతమైన జీవితం పొందవచ్చు. శారీరకంగా.. మానసికంగా ఎంతో సంతృప్తి జీవితం పొందాలంటే యోగాను రోజువారీ కార్యకలాపాల్లో భాగం చేసుకోవాలి. యోగా ప్రపంచంలో పతంజలి యోగా ఎంతో ప్రత్యేకం. పతంజలి యోగాకు లక్షలాది మంది ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అంతలా ఆకర్షితులు కావడానికి కారణమేమిటి? పతంజలి యోగాలో ఏముంటాయో తెలుసుకుందాం.
Also Read: Teachers Holiday: ప్రభుత్వ టీచర్లకు 7 రోజుల సెలవులు.. ఎప్పుడు? ఎందుకో తెలుసా?
శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా ఇది ఇప్పుడు పతంజలి యోగా ఒక సమగ్ర అభ్యాసంగా మారింది. మనశ్శాంతిని, ఆధ్యాత్మిక అవగాహనను పెంచడంలో పతంజలి యోగా సహాయ పడుతుంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో మనుషులు తరచుగా ఒత్తిడి, అశాంతికి గురవుతుండడంతో యోగా అన్ని కోణాల నుంచి ఆరోగ్యానికి ఒక పరిష్కారం అందిస్తోంది. ఒకప్పుడు యోగా పాత పద్ధతి అని దానిపట్ల ఆకర్షితులు అయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు యోగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక ముఖ్యమైన భాగంగా మారడంతో అందరూ ఆకర్షితులవుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది యోగా చేస్తున్నారు.
Also Read: Allu Arjun: వివాదంలో అల్లు అర్జున్ 'జులాయి'.. ఆ సినిమాను చూసి అచ్చం అలానే!
యోగాకు విశేషంగా ప్రాధాన్యం పెరుగుతుండడంతో.. వాటిలో పతంజలి కంపెనీ పాత్ర పెద్దది. బాబా రామ్ దేవ్ నిర్వహణలో పతంజలి యోగా ఈ పురాతన వైద్యశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది. ఆయుర్వేదిక ఉత్పత్తులు, సహజ చికిత్సలను పతంజలి ప్రోత్సహిస్తోంది. అతి స్వల్పకాలంలో పతంజలీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి యోగా ప్రోత్సహించడంలో కీలక పాత్రను పోషిస్తోంది.
పతంజలి యోగా ప్రత్యేకతలు
పతంజలి యోగా శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతపై దృష్టి పెడుతుంది. దీనిలో 8 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. వాటిని అష్టాంగ యోగా అని పిలుస్తారు.
- యమ (నైతిక సూత్రాలు)
- నియమ (వ్యక్తిగత నియమాలు)
- ఆసన (శరీర భంగి)
- ప్రాణాయామ (శ్వాస నియంత్రణ)
- ప్రత్యాహార (ఇంద్రియాల్ని నియంత్రించడం)
- ధారణ (కేంద్రిత దృష్టి)
- ధ్యానం (ధ్యాన విధానం)
- సమాధి (ఆధ్యాత్మిక జ్ఞానం)
ఎందుకు ఆకర్షణ?
పతంజలి యోగా కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం పని చేస్తోంది. యోగా చేయడంతో మనం మనసును సంతృప్తి పరచుకోగలుగుతాం. మనఃశాంతిని పొందగలుగుతాం. తద్వారా మనం ఆందోళన లేకుండా సంతోషంగా జీవించగలుగుతాం. ఇది పతంజలి యోగా ప్రాధాన్యాన్ని పెంచడానికి కారణంగా నిలిచింది.
పతంజలి యోగా ఫౌండేషన్
ఉత్తరాఖండ్‌లోని ఋషికేశ్ నగరంలో పతంజలి హత యోగా ఫౌండేషన్ పాత యోగా పద్ధతులను నేటి ఆధునిక పద్ధతులకు మిళితం చేయడానికి పనిచేస్తుంది. అక్కడ హత యోగా, అష్టాంగ యోగా, కుండలిని యోగా, ఆరోగ్య చికిత్స కోసం ప్రత్యేక యోగా సదస్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. అన్ని వయస్సుల వారికి ఉపయోగకరంగా ఈ యోగా ఉంటోంది. ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని పునరుద్ధరించే యోగా ఒత్తిడి, ఆందోళన, ఇతర ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయ పడుతుంది. యోగా ఆసనాలు, శ్వాస సంశీలనం, ధ్యానం, విశ్రాంతి పతంజలి యోగా ద్వారా లభిస్తాయి.
రిషికేశ్‌లోని పతంజలి యోగాలో ఆయుర్వేదాన్ని కూడా యోగాతో అనుసంధానం చేశారు. సరైన ఆహారం, మంచి జీవనశైలి, ఔషధ మొక్కలతో చికిత్సలకు సలహా ఇస్తారు. దీంతో మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. పతంజలి యోగా శారీరక శక్తి, మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఒక సమగ్ర దృక్కోణాన్ని అందిస్తుంది. దీంతో లక్షల మంది పతంజలి యోగాకు ఆకర్షితులవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









