)
IT Jobs: భారత్ లో ఐటీ రంగంలో కొత్త రిక్రూట్ మెంట్స్ భారీగా తగ్గాయి. ఏఐ టెక్నాలజీ పెరగడంతో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తూన్న సంస్థలు శ్రామిక శక్తిని భారీగా తగ్గించుకుంటున్నాయి. దీంతో నియామకాలు కూడా తగ్గడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. గత రెండు సంవత్సరాలుగా ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు దాదాపు జీరో అని క్వెస్ సంస్థ తెలిపింది. భవిష్యత్తులో కూడా నియామకాలు ఆశాజనంగా కనిపించడం లేదని నివేదిక పేర్కొంది. అటు లేఆఫ్స్ కూడా భారీగా ఉండటంతో ఐటీ ఉద్యోగులంతా అభద్రతా భావంతోనే పనిచేస్తున్నారని తెలిపింది.
దేశంలో ఐటీరంగంలో ఉద్యోగ నియామక మాంద్యం నడుస్తోంది. గత రెండు సంవత్సరాలుగా టెక్ రంగంలో నియామకాలు దాదాపుగా లేవని క్వెస్ కార్ప్ సంస్థ తెలిపింది. గత ఆరు, ఏడు త్రైమాసికాల నుంచి ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు దాదాపు శూన్యమని క్వెస్ సీఈఓ గురుప్రసాద్ శ్రీనివాసన్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా డిమాండ్ పెరిగేలా కనిపించడం లేదని పేర్కొన్నారు. ఐటీ నియామకాల్లో మందగమనం ఉన్నా..ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో డిమాండ్ బలంగా ఉందని తెలిపారు.
గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ జీసీసీ, నాన్ ఐటీ సంస్థల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తుంది అని అన్నారు. క్వెస్ కు 73 శాతం సిబ్బంది డిమాండ్ ఈ రంగాల నుంచే వస్తున్నట్లు శ్రీనివాసన్ తెలిపారు. ఈ త్రైమాసికంలో ఎక్కువ నియామకాల తయారీ రంగం నుంచి ఉండగా ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో ఉన్నాయని తెలిపారు. రిటైల్, టెలికాం రంగాల్లో స్వల్పంగా తగ్గాయని చెప్పారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ బీఎఫ్ఎస్ఐ రంగం డెవలప్ మెంట్ ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
టెలికాం, ఉత్పత్తి, టెక్ రంగాల్లో కూడా వృద్ధి కొనసాగుతుందని తెలిపారు. అదే సమయంలో సుంకాల సంబంధిత ప్రతికూలతల కారణంగా ఫార్మా, రిటైల్, ఆటో తయారీ రంగాలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కుంటున్నట్లు వివరించారు. అటు అమెరికాలోనూ భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏఐ కారణంగా ఒక్క జూలై నెలలో దాదాపు 10వేల మంది ఉద్యోగాలు కోల్పోయిన్టులు ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ తెలిపింది. ఏఐ సంబంధిత పునర్నిర్మాణంలో భాగంగా అమెరికాలోని ప్రైవేట్ సంస్థలు జులైలో 10వేల కంటే ఎక్కువ ఉద్యోగాలను తొలగించినట్లు రిపోర్టు పేర్కొంది. అమెరికాలో ఈ ఏడాది జులై వరకు దాదాపు 8లక్షల కంటే ఎక్కువ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు కోతలు విధించినట్లు తెలిపింది. దీనిలో సాంకేతిక రంగంలో ఎక్కువగా 89వేల కంటే ఎక్కువ మంది తమ ఉద్యోగాలు కోల్పోయినట్లు వివరించింది.
టారిఫ్ లు, ఏఐ డెవలప్ మెంట్ కారణంగా లేఆఫ్స్ జరుగుతున్నట్లు తెలిపింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగంలోనూ భారీగా కోతలు జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2.92 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులను ట్రంప్ ప్రభుత్వం ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి