)
Vodafone Idea shares: వొడాఫోన్ ఐడియా షేర్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇంట్రలాడేలో సుమారు 9శాతం పెరిగి రూ. 7.30 స్థాయికి చేరాయి. అయితే శుక్రవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కాస్త తగ్గి 7శాతం వ్రుద్ధితో రూ. 7.02 వద్ద ముగిసాయి. క్రితం సెషన్లో నూ షేరు ధర రూ. 6.55 వద్ద ముగిసింది. వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేసే విషయంలో కేంద్రం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులు ఐడియా వొడాఫోన్ షేర్లను భారీగా కొనుగోలు చేశారని చెప్పవచ్చు.
వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి రూ. 2లక్షల కోట్ల చెల్లింపు బకాయి ఉంది. వీటిలో ఏజీఆర్ బకాయిలు 83,400కోట్లు. అయితే వీటిలో వడ్డీ , పెనాల్టీలను తీసివేసే ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ దీనికి ఆమోదం లభించినట్లయితే ఏజీఆర్ డ్యూస్ రూ. 28,000కోట్లకు తగ్గుతాయి. వొడాఫోన్ ఐడియాకు భారీ రిలీఫ్ లభించనున్నట్లు అవుతుంది. వొడాఫోన్ తోపాటు భారతీఎయిర్ టెల్ కూడా వడ్డీ, పెనాల్టీల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు టెలికాం శాఖ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బకాయిలు మాఫీ చేసినట్లయితే ఈ రెండు టెలికాం కంపెనీలకు బిగ్ రిలీఫ్ లభించినట్లవుతుంది.
మరోవైపు ఎయిర్ టెల్ షేర్లు శుక్రవారం అతి స్వల్పంగా 0.16శాతానికి పెరిగాయి. మార్కెట్ ముగింపు సమయానికి రూ. 1,933 దగ్గర ట్రేడ్ అవుతోంది. గురువారం రూ. 1,929దగ్గర ముగిసిన షేర్లు శుక్రవారం 1934 వద్ద ప్రారంభం అయ్యాయి. ఇంట్రాడేలో రూ. 1,948 స్థాయికి చేరాయి. కానీ ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. వొడాఫోన్ స్టాక్ ను విశ్లేషించిన 21మంది అనలిస్టుల్లో కేవలం 4 గురు మాత్రమే బై రేటింగ్ ఇచ్చారు. 6గురు హోల్డ్ చేసుకోవాలని సూచించారు. 11 మంది అనలిస్టులు అయితే సేల్ రేటింగ్ ఇచ్చారు. ఈస్టాక్ కు వీరిచ్చిన ఏడాది సగటు టార్గెట్ ధరను పరిశీలిస్తే కేవలం 06శాతం పెరిగే ఛాన్స్ ఉంది. కాగా వొడాఫోన్ ఐడియా షేర్లు గత ఐదు సెషన్లలో చూస్తే 10శాతం ర్యాలీ చేశాయి. గతేడాది కాలంలో మాత్రమే 56శాతం పతనం అయ్యాయి.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.