Trump Tariffs Fears: భారత్ నెత్తిన ట్రంప్ పిడుగు.. మరికొన్ని గంటల్లో ట్యాక్స్ బాంబ్

Trump Tariffs Fears: ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్నాయి. దీంతో భారత మార్కెట్లో మరోసారి కరెక్షన్స్ కు లోనుకావచ్చనే అంచనాలు తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.   

Written by - Bhoomi | Last Updated : Apr 1, 2025, 08:13 PM IST
Trump Tariffs Fears: భారత్ నెత్తిన ట్రంప్ పిడుగు.. మరికొన్ని గంటల్లో ట్యాక్స్ బాంబ్

Trump Tariffs Fears: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించబోయే ప్రతీకార సుంకాల డెడ్ లైన్ దగ్గర పడింది. లిబరేషన్ డేగా  జనాల నోళ్లలో నానుతున్న ఏప్రిల్ 2వతేదీ పై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా  ట్రంప్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. తమ దేశ ఉత్పత్తులపై భారీగా సుంకాల విధిస్తున్న దేశాలపై ప్రతికార టారీష్ లు వడ్డిస్తామని గతంలో వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చర్చలకు వీలుగా ఏప్రిల్ 2వ తేదీ వరకు సుంకాల విధింపును వాయిదా వేశారు. దీంతో తదుపరి ఏం జరగబోతుందా? అన్న ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. భారీ సుంకాలకు  ట్రంప్ సిద్దమైతే మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు లోన్ అవుతాయని భారత మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Add Zee News as a Preferred Source

 ఇప్పటికే భారతీయ మార్కెట్లు కరెక్షన్లో చవిచూశాయి.  దేశ ఆర్థిక రంగంలో మందకొడితనం, కార్పొరేట్ ఆదాయాల్లో కోత, ఎఫ్బిఐలు తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకోవడంతో  మార్కెట్లో పతనమయ్యాయి. ఇక ట్రంప్  సుంకాల వడ్డింపు  భారీగా ఉంటే మార్కెట్లో మళ్లీ అమ్మకాల జోరు పెరిగే అవకాశం మెండుగా కనిపిస్తుంది.  ప్రతీకార సుంకాల భయాల ప్రభావంతో అమెరికా మార్కెట్ సూచీలు ఇప్పటికే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. డో జోన్స్ 715.8 పాయింట్స్ పడిపోగా ఇండెక్స్ 112.37 పాయింట్ల మీద దిగజారింది. ట్రంపు సుంకాల ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కొక్కలా ఉంటుందని మార్కెట్ నిపుణులు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Reciprocal Tariff: ట్రంప్ టారీఫ్.. అమెరికాతో సహా ఏ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అందులో భారత్ ఉందా?  

 అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న భారత్, థాయిలాండ్, బ్రెజిల్ దేశాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ప్రతీకార సుంకాలు  విధిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పలు దేశాలతో అమెరికా వాణిజ్యం,  వాట్ రేట్లు, డిజిటల్ పన్నులు, తదితర అంశాలను పరిశీలిస్తున్న అమెరికా వాణిజ్య శాఖ ఇతర అధికారులు తమ రిపోర్టును ఏప్రిల్ 1న విడుదల చేశారు.  వీటితో పాటు భౌగోళిక రాజకీయ అంశాలు కూడా ట్రంప్  ప్రతీకార సుంకాల విధానాన్ని  ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. భారత్ పై భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు  పడని పక్షంలో స్టాక్ మార్కెట్లో ఎఫ్బీఐ నిధుల వెల్లువా యధావిధిగా కొనసాగుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.  విదేశీ కాలరపై 25% సుంకం కూడా ఏప్రిల్ 2 నుంచే అమల్లోకి రానుంది. అయితే కొన్ని భారతీయ సంస్థలకు అమెరికాలోని కాల తయారీ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ కంపెనీలపై సుంకాల ప్రభావం అంతగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ ఇప్పటికే పలుమార్లు కరెక్షన్ కు లోనైందని మరింత  కరెక్షన్కు అవకాశం తక్కువగా ఉందని కామెంట్ వినిపిస్తున్నాయి. 

Also Read:  Trump Tariffs: ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్‌లు.. ఈ భారతీయ ఫార్మా కంపెనీలకు చావు దెబ్బ తప్పదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News