Stock Market: మార్చిలో స్టాక్ మార్కెట్ తిరిగి ట్రాక్‌లోకి వస్తుందా? గణాంకాలు ఏమి సూచిస్తున్నాయో తెలుసుకోండి

Stock Market: గత పదేళ్ల డేటా ప్రకారం నిఫ్టీ 2016, 2017, 2019, 2021, 2022, 2023, 2024 లలో లాభంతో ముగిసింది. అయితే 2015, 2018, 2020ఏళ్ల మాత్రం భారీ నష్టాలతో ముగిసింది.   

Written by - Bhoomi | Last Updated : Mar 1, 2025, 05:55 PM IST
Stock Market: మార్చిలో స్టాక్ మార్కెట్ తిరిగి ట్రాక్‌లోకి వస్తుందా? గణాంకాలు ఏమి సూచిస్తున్నాయో తెలుసుకోండి

Stock Market: స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. నిన్న ఒక్క రోజు పదిలక్షల కోట్లు నష్టపోయారు ఇన్వెస్టర్లు. ఈ సమయంలో పెట్టుబడిదారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు. 1996 తర్వాత మొదటిసారిగా, నిఫ్టీ వరుసగా 5 నెలలు క్షీణతను నమోదు చేస్తోంది. అంటే నిఫ్టీ 29 సంవత్సరాలలో అత్యంత చెత్త పనితీరును కనబరిచింది. సెప్టెంబర్ నెలలో, నిఫ్టీ దాని ఆల్ టైమ్ హై 26,277.35 నుండి 16% లేదా 4,150 పాయింట్లు పడిపోయింది. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు ప్రకటించడం, భారతీయ కంపెనీల బలహీన ఫలితాలు,  మందగమన ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారుల మానసిక స్థితిని దెబ్బతీశాయి. దీని కారణంగా, భారత మార్కెట్లో అమ్మకాలు ఆగలేదు. ఈ నేపథ్యంలో గత 5 నెలలుగా కొనసాగుతున్న క్షీణత మార్చిలో ఆగిపోతుందా? ఈ గణాంకాలు ఏమి సూచిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

మనం ఒకసారి  స్టాక్ మార్కెట్ డేటాను పరిశీలించినట్లయితే.. గత పదేళ్లలో మార్చి నెలలో మార్కెట్ 7 సార్లు బూమ్‌ను చూసింది. గత 10 సంవత్సరాల డేటా ప్రకారం నిఫ్టీ 2016, 2017, 2019, 2021, 2022, 2023, 2024 లలో లాభంతో ముగిసింది. అయితే 2015, 2018, 2020భారీ నష్టాల్లో ముగిసింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FIIs) కొనుగోళ్ల కారణంగా నిఫ్టీ మార్చి 2016లో అత్యధికంగా 11% లాభాన్ని నమోదు చేసింది. 2023లో అత్యల్ప రాబడి 0.32% నమోదైంది. 2020లో నిఫ్టీ అతిపెద్ద పతనం మార్చిలో 23%, దీనికి కోవిడ్ 19, ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణం. 2015లో ఇండెక్స్ 4.6% తగ్గింది. అయితే 2018 లో ఇది 3.6% తగ్గింది. 

Also Read: Gold Rate Today: ఇంతకంటే శుభవార్త ఏముంటుంది..మళ్లీ తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందో తెలుసా?  

ఫిబ్రవరి చివరి రోజు శుక్రవారం నాడు, విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు జరిపారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) శుక్రవారం నాడు రూ.11,639 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించారు. ఇది ఫిబ్రవరిలో ఒకే రోజు జరిగిన అతిపెద్ద అమ్మకంగా పెట్టుబడిదారులు చెబుతున్నారు.  ఆ నెల మొత్తం వారు రూ.34,574 కోట్ల విలువైన అమ్మకందారులుగా ఉన్నారు. 20 ట్రేడింగ్ సెషన్లలో కేవలం రెండు సందర్భాలలో మాత్రమే కొనుగోలుదారుడు అమ్మాడు. ఫిబ్రవరి 18న రూ. 4,786.6 కోట్ల విలువైన దేశీయ స్టాక్‌లను కొనుగోలు చేసినప్పుడు, ఫిబ్రవరి 4న  రూ. 809.2 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. 

Also Read: 7th Pay Commission DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ బొనంజా.. ఒకేసారి భారీగా ఖాతాల్లోకి డబ్బులు జమ..! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News