New Labor Codes: కొత్త లేబర్ కోడ్‌లు అమలు వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఉద్యోగుల్లో ఒక సందేహం నెలకొంది. పీఎఫ్ నిర్మాణంలో మార్పులు జరిగితే తమ టేక్-హోమ్ సాలరీ తగ్గుతుందా? ప్రత్యేకంగా బేసిక్ పే, అలవెన్సులు, డిడక్షన్లపై సోషల్ మీడియా, ఉద్యోగ వర్గాల్లో గందరగోళం నెలకొంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. ప్రస్తుత చట్టబద్ధమైన వేతన పరిమితి ప్రకారం పీఎఫ్ కొనసాగినంతకాలం, నెల జీతం తగ్గదని కేంద్రం స్పష్టం చేసింది.
పీఎఫ్ వేతన పరిమితి ఎలా పని చేస్తుంది?
ఇప్పటి వరకు పీఎఫ్ లెక్కల కోసం వర్తించే ప్రామాణిక వేతన పరిమితి రూ. 15,000. ఈ పరిమితి మార్పు చెందకపోవడంతో, ఉద్యోగి, యజమాని ఇద్దరూ గరిష్టంగా 12శాతం చొప్పున రూ. 1,800 మాత్రమే చెల్లించాలి. అంటే రూ. 15,000 పైన ఉన్న జీతానికి పీఎఫ్ చెల్లించడం పూర్తిగా ఉద్యోగి స్వచ్ఛంద నిర్ణయం. కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చినా కూడా ఈ నియమంలో మార్పు జరగలేదు.
వేతన నిర్మాణం ఎందుకు మారింది?
కొత్త కోడ్‌ల ప్రధాన లక్ష్యం వేతన నిర్మాణాన్ని సిస్టమేటిక్‌గా మార్చడం. బేసిక్ పే, డీఏ మొత్తం జీతంలో కనీసం 50శాతం ఉండేలా కొత్త కోడ్స్ రూపొందించింది. ఎందుకంటే, చాలా సంస్థలు అలవెన్సులు అధికంగా చూపించి పీఎఫ్ లెక్కలను తగ్గిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ విధానం ద్వారా వేతన నిర్మాణంలో పారదర్శకత పెరుగుతుంది. ఉద్యోగి భవిష్యత్ సేవింగ్స్ పెరుగుతాయి.
Also Read:
ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం
మొత్తం జీతం: రూ. 60,000
బేసిక్ + డీఏ: రూ. 20,000
అలవెన్సులు: రూ. 40,000
కొత్త నియమాల ప్రకారం, అలవెన్సులు మొత్తం జీతంలో 50శాతం (రూ. 30,000) మించితే, అదనంగా ఉన్న రూ. 10,000 వేతనంలో కలుస్తుంది. అప్పుడు పీఎఫ్ లెక్కల కోసం అర్హమైన వేతనం రూ. 30,000 అవుతుంది.
అయితే పీఎఫ్ మాత్రం రూ. 15,000 సీలింగ్‌పై మాత్రమే లెక్కిస్తారు. అంటే యజమాని, ఉద్యోగి రెండింటి పీఎఫ్ రూ. 1,800కే పరిమితం అవుతుంది.
జీతం ఎందుకు తగ్గదు?
వేతన నిర్మాణంలో మార్పులు జరిగినా,
పీఎఫ్ లెక్కించే బేస్ అమౌంట్ మార్చకపోవడంతో,
ఉద్యోగి చేతికి వచ్చే మొత్తంలో ఎలాంటి కోత ఉండదు.
ఇంకా సులభంగా చెప్పాలంటే, ఉద్యోగి స్వచ్ఛందంగా అధిక పీఎఫ్ డిడక్షన్ ఎంచుకోనంత వరకు, కొత్త లేబర్ కోడ్స్ మీ నెల జీతంపై ప్రతికూల ప్రభావం చూపవు.
మొత్తంగా కేంద్రం స్పష్టం చేసింది ఏంటంటే.. మీరు స్వచ్చందంగా అధిక పీఎఫ్ చెల్లింపును ఎంచుకోనంత వరకు రూ. 15వేల పీఎఫ్ సీలింగ్ కారణంగా కొత్త లేబర్ కోడ్స్ మీ నెలవారీ టేక్ హోమ్ జీతం తగ్గదు. ఈ కోడ్స్ ప్రధానంగా వేతన నిర్మాణంలో పారదర్శకతను మాత్రమే పెంచుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









