Business Ideas: వ్యాపారం పురుషుల సొత్తేం కాదని నిరూపించిన సూపర్ వుమెన్..ఉద్యోగం మానేసి.. రోజుకు రూ.3వేలు సంపాదన

Business Ideas: వ్యాపారం అనేది ఖర్చుతోనే కాదు మంచి ఐడియాతో కూడుకున్నది. మనలో చాలా మందికి ఉద్యోగం చేయాలని ఉంటుంది. కానీ మంచి జీతం లేకపోవడం ఉద్యోగం కంటే వ్యాపారమే బెటర్ అని భావిస్తుంటారు. అయితే వ్యాపారం అంటే పురుషులే కాదు మహిళలూ చేయగలరని నిరూపిస్తున్నారు ఈ తరం మహిళలు. వ్యాపారంలో పురుషులతో పోటీ పడుతూ సక్సెస్ అవుతున్నారు. వ్యాపారమంటే పురుషుల సొత్తేం కాదని నిరూపిస్తున్నారని. ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభించి రోజుకు మూడువేల సంపాదిస్తున్న ఓ మహిళ గురించి ఎప్పుడు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Apr 15, 2025, 11:04 PM IST
 Business Ideas: వ్యాపారం పురుషుల సొత్తేం కాదని నిరూపించిన సూపర్ వుమెన్..ఉద్యోగం మానేసి.. రోజుకు రూ.3వేలు సంపాదన

Business Ideas: మంచి ఆలోచన ఉంటే..డబ్బు లేకున్న వ్యాపారంలో రాణించవచ్చు. వ్యాపారంలో రాణించాలంటే డబ్బే ముఖ్యం కాదు..అందుకు తగ్గ ఆలోచనలు, ఆచరణలు ఉండాలి. ఈ కాలంలో కాలా మంది ఉద్యోగాలకంటే వ్యాపారాలే బెటర్ అంటూ ఈ రంగంలోకి వస్తున్నారు. దీంతో కాస్త తెలివితో వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అయితే వ్యాపారం అంటే పురుషులే చేస్తారని అనుకుంటారు. కానీ ఇప్పుడు పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. వ్యాపారమంటే పురుషుల సొత్తు కాదని నిరూపిస్తున్నవారు..నిరూపించినవారు ఎంతో మంది ఉన్నారు. చిన్న పెట్టుబడితో ఇంట్లో కూర్చుండి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో పెళ్లైన మహిళలు ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలంటే ఇళ్లు, పిల్లల బాధ్యతలు అడ్డువస్తున్నాయి. 

Add Zee News as a Preferred Source

కానీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహిళ ఉన్నతమైన చదువులు పూర్తి చేసింది ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. దీంతో వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే ఓ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పుడు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. సంధ్య స్థానికంగా దుర్గభవాని మిల్లెట్స్ అనే పేరుతో మిల్లెట్ హోటల్ ను రెండు సంవత్సరాలుగా నడిపిస్తోంది. ఈ హోటల్లో మరో నలుగురిని చేర్చుకుంది. వారికి కూడా ఉపాధి కల్పిస్తోంది. 

సంధ్య ఎంసీఎ పూర్తి చేసిన వెంటనే ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలంటే ఆశించిన జీతం రాలేదు. అయితే ఇంట్లోనే ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచించింది. ఇంటి బాధ్యతలు చూసుకుంటే వ్యాపారం చేస్తే బాగుంటుందని నిర్ణయించింది. కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించారు. దీంతో మిల్లెట్ తో టిఫిన్స్ చేద్దామనే ఆలోచించింది. తన భర్త సలహాతో మిల్లెట్ టిఫిన్స్ సెంటర్ ప్రారంభించింది. మంచి నాణ్యతను అందించడంలో సంధ్య ఈ బిజినెస్ సక్సెస్ అయ్యింది. 

Also Read: Swiggy Pyng App: స్విగ్గీ నుంచి సరికొత్త యాప్.. యూజర్ల కోసం ఏఐ ఆధారిత పింగ్.. దెబ్బకు దూసుకుపోయిన షేర్లు  

నేటికాలంలో పెరుగుతున్న ఖర్చులకు చాలీ చాలని జీతాలు ఇంట్లో ఒకరు కష్టపడితే కుటుంబం గడవలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో తన భర్త సంపాదనకు తోడుగా నిలిచేందుకు ఉద్యోగం చేద్దామన్న ఆలోచనతో ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టింది సంధ్య. ఆమె ఒక్కతే కాదు మరో నలుగురికి ఉపాధి  కల్పిస్తోంది. ఖర్చులన్నీ పోనూ రోజు 3వేలు సంపాదిస్తోంది. కష్టపడితే..ప్రతిఫలం దానంతట అదే వస్తుంది. కష్టాన్ని నమ్ముకున్నవారు..కష్టాలపాలైంది చరిత్రలో లేదు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News