)
Udyogini Scheme Interest Free Loan: వడ్డీ లేని రుణం ఇవ్వడమే కాకుండా అసలులో కూడా ప్రభుత్వం కొంత చెల్లిస్తున్న పథకం ఒకటి ఉంది. ఈ పథకంతో మహిళలు వ్యాపారంలో రాణించేందుకు అద్భుత అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో వ్యాపారం చేసుకుని సొంత కాళ్లపై నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక పథకం అందిస్తోంది. ఆ పథకం పేరు ఉద్యోగిని. ఉద్యోగిని పథకం వ్యాపారంలో రాణించాలనుకునే మహిళలకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యం.
స్వయం ఉపాధి పొందాలనుకుంటున్న మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని పథకం ప్రారంభించింది. మహిళలను వ్యాపారంలో రాణించడమే కాకుండా ఆర్థికంగా స్థిరపడేలా చేయడం ఉద్యోగిని పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం సులువుగా మహిళలకు లభిస్తుంది. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి వడ్డీ లేని రుణాలు ఉద్యోగిని పథకం ద్వారా అందుతాయి. రుణం చెల్లింపులో రాయితీ కూడా అందిస్తుండడం విశేషం.
ఉద్యోగిని పథకానికి అర్హులు వీరే!
ఎంత రుణం?
ఈ పథకం కింద మహిళలకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణం అందిస్తారు. ఈ రుణం పొందేందుకు మహిళలు ఎలాంటి సెక్యూరిటీ/ హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు.
రుణ గడువు
తీసుకున్న రుణం తిరిగి చెల్లించడానికి గడువు ఏడేళ్లలోపు చెల్లించవచ్చు. 3 నుంచి 7 సంవత్సరాల వరకు రుణం చెల్లించేందుకు బ్యాంకులు గడువు ఇస్తాయి. చెల్లింపు గడువు అనేది తీసుకున్న లోన్, వ్యాపార స్వరూపం, బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
దరఖాస్తు విధానం
ఉద్యోగిని పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అన్ని బ్యాంకుల (కమర్షియల్ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్లు) వద్దకు వెళ్తే అక్కడి సిబ్బంది వివరాలు చెబుతారు. సమీపంలోని బ్యాంకును సంప్రదించాలి. దీంతోపాటు రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో లేదా ఆన్లైన్ పోర్టల్‌లో కూడా దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి.
వడ్డీ లేని రుణం వీరికే..
జనరల్, ఓబీసీ మహిళలకు వడ్డీ 10 శాతం నుంచి 12 శాతం మధ్య ఉంటుంది. ఈ వడ్డీ రేటు బ్యాంకు, ఈ పథకం రాష్ట్ర వాటా అమలును బట్టి స్వల్పంగా మారవచ్చు. వీరికి కూడా రుణం మొత్తంలో 30 శాతం వరకు రాయితీ లభిస్తుంది.
కావాల్సిన పత్రాలు
బిజినెస్‌లు ఇవే!
ఈ వ్యాపారాలకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి