PM Modi Environment Day: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో సింధూర మొక్కను నాటారు. 1971 యుద్ధంలో అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించిన కొంతమంది మహిళలు ఈ మొక్కను ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ఈ చొరవ ఇటీవలి ఆపరేషన్ సింధూరానికి కూడా ముడిపడి ఉంది. ప్రధాని మోదీ మాట్లాడుతూ..నేను నా నివాసంలో ఈ మొక్కను నాటడం చాలా గర్వంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రస్తావించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే..ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ వద్ద జరిగిన తీవ్రవాద దాడిలో 26 మంది భారతీయులు తమ ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు మే 7న ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్ తోపాటు పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిభిరాలపై దాడులు నిర్వహించగా 100మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ దాడుల తర్వాత మే 10న భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఏక్ పెడ్ మా కే నామ్ అనే వినూత్న ఉద్యమం రెండో దశను ప్రారంభించారు. జూన్ 5 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా 10కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద మొక్కలు నాటి, తల్లిపట్ల ప్రేమను ప్రక్రుతి పట్ల బాధ్యతను చాటాలంటూ పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.
సింధూరం మొక్క ప్రత్యేకత ఏమిటి?
సింధూరం మొక్కను శాస్త్రీయంగా బిక్సా ఒరెల్లానా అని పిలుస్తారు. ఇది ఔషధ, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన మొక్క. దీనిని కుంకుమ చెట్టు, కమిల చెట్టు లేదా లిప్‌స్టిక్ చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ మొక్క దక్షిణ అమెరికా, మెక్సికో, కొన్ని ఆసియా దేశాలలో కనిపిస్తుంది. భారత్ లో దీనిని ప్రధానంగా మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో పెంచుతారు.
Also Read: IPL 2025: సంజీవ్ గోయెంకా సంచలన నిర్ణయం! LSG జట్టులో 4 పెద్ద మార్పులు.. ఆ ప్లేయర్ అవుట్...!!
ఈ మొక్క పండ్లు, విత్తనాలు ఎరుపు లేదా నారింజ రంగు సహజ రంగును ఇస్తాయి. దీనిని సిందూరంగా ఉపయోగిస్తారు. ఈ రంగు స్వచ్ఛమైనది. రసాయనాలు లేనిది. ఇది చర్మానికి సురక్షితం. దీని విత్తనాలను పొడి లేదా ద్రవ రూపంలో సిందూరంగా తయారు చేయడానికి చూర్ణం చేస్తారు. దీనిని మతపరమైన కార్యక్రమాలు, మాంగ్, సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు.
ఔషధ గుణాలు: ఈ మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంది. దీని విత్తనాలను, రసం జ్వరాన్ని తగ్గించడం, మధుమేహ నివారణ, రక్త శుద్ధికి ఉపయోగిస్తారు. ఇది గుండె బలాన్ని పెంచడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









