US vs China Trade War: ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నాయి. అమెరికా వర్సెస్ చైనా మధ్య జరుగుతున్న ఆర్థిక వివాదం తాజాగా మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే అడ్డగోలుగా అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ టారిఫ్‌లు పెంచడంతో ప్రపంచం అతలాకుతలం అవుతుండగా.. దీనికి ప్రతిగా చైనా అంతకుమించి టారిఫ్‌లు విధించడంతో ప్రపంచ దేశాలు విస్తుపోయాయి. వీరిద్దరూ ఆర్థిక యుద్ధానికి దిగడంతో ప్రపంచంలోనే అన్ని దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. వీరిద్దరి మధ్యలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నలిగిపోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవు.. ప్లాన్ చేసుకుంటే ఏకంగా ఐదు రోజుల సెలవులు
వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్‌కు అదే రీతిలో చైనా ఎదురుదెబ్బ కొట్టింది. అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించింది. చైనా వస్తువులపై అమెరికా 104 శాతం సుంకం విధించగా.. అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి పెంచిన సుంకాలు అమల్లోకి వస్తాయని డ్రాగన్ దేశం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో 34 శాతం పెంచగా.. తాజాగా పెంచిన వాటితో కలిపి అమెరికాపై చైనా సుంకాలు భారీగా పెరిగాయి.
Also Read: Miss World 2025: తెలంగాణ కీర్తిని పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేయగా చైనా కూడా ఆ సంస్థకు ఫిర్యాదు చేసింది. ప్రపంచ వాణిజ్య స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తున్నాయని అమెరికా, చైనా పరస్పరం డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసుకున్నాయి. ట్రంప్ తీరుకు నిరసనగా చైనా 12 అమెరికా కంపెనీలను ఎగుమతి నియంత్రణ జాబితాలో చైనా చేర్చడం గమనార్హం. మరో ఆరు కంపెనీలను నమ్మకూడని సంస్థ జాబితాలో చేరుస్తూ చైనా నిర్ణయం తీసుకుంది.
అమెరికాపై సుంకాలు పెంచిన సందర్భంగా చైనా కీలక ప్రకటన చేసింది. అమెరికా తీరును మరోసారి తప్పుబట్టింది. 'చైనాపై అమెరికా సుంకాలను పెంచడం తప్పు మీద తప్పు. చైనా హక్కులు, ప్రయోజనాలను తీవ్రంగా ఉల్లంఘిస్తుంది. బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది' అని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రంపు సుంకాలకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని చైనా ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన 54 శాతానికి అదనంగా 50 శాతం కలపడంతో చైనాపై విధించిన అమెరికా సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









