Patanjali Yoga And Ayurveda Services: పతంజలీ ఆయుర్వేదం ఆధునిక శాస్త్రం సహాయంతో ప్రజారోగ్యాన్ని మార్చివేసింది. స్వామి రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణ 2006లో ప్రారంభించిన పతంజలి సంస్థ ఇప్పుడు భారతదేశంలోని నలుమూలలా విస్తరించి యోగ, ఆయుర్వేద సేవలు అందిస్తోంది. ఆయుర్వేదం, యోగాను ఆధునిక శాస్త్ర పద్ధతులతో అనుసంధానం చేయడం ఈ సంస్థ లక్ష్యం. పాత భారతీయ వైద్య పద్ధతులను శాస్త్రీయ పరిశోధన, ల్యాబ్ పరీక్షలతో సరిచూసి ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైనదిగా తయారు చేయడం పతంజలి లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Patanjali: పతంజలి ఆయుర్వేదం ఉత్పత్తులు 'సాక్ష్యాధారిత ఔషధం'.. అంటే ఏమిటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా పతంజలీ
పతంజలీ తన ఉత్పత్తులను అనేక దేశాలకు ఎగుమతి చేస్తోంది. విదేశాలలో ఎన్నో వెల్‌నెస్ కేంద్రాలను విస్తరించింది. అమెరికాలోని టెక్సాస్, హ్యూస్టన్‌లో పతంజలీ వెల్‌నెస్ కేంద్రాలు ఉన్నాయి. ఆయుర్వేద మసాజ్, ఆరోగ్య సలహాలు, వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలు అక్కడి అమెరికా పౌరులు పొందుతున్నారు. బ్రిటన్, నేపాల్, కెనడా, మారిషియస్ వంటి దేశాలలో కూడా పతంజలీ యోగపీఠం బ్రాంచీలు, ట్రస్ట్‌లు ఉన్నాయి. పతంజలీ గ్రూప్ ఉత్పత్తులు దాదాపు 200 దేశాలలో విక్రయాలు జరుగుతున్నాయి.
Also Read: Maruti Suzuki Ertiga: దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బడ్జెట్ ఫ్రెండ్లీ పెద్ద కారు ఏదో తెలుసా?
పతంజలీ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రఖ్యాత అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్స్‌లో తమ పరిశోధనలను ప్రచురించింది. ఈ పరిశోధన పేపర్లలో యోగా, ఆయుర్వేదం ప్రయోజనాలను శాస్త్రీయంగా వివరించారు. పతంజలీ సంస్థ తన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆయుర్వేద చికిత్సలు పెద్దగా ప్రాచుర్యం పొందని దేశాలలో కూడా పతంజలి సేవలు అందిస్తోంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం
జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పరిగణిస్తున్నారు. రామ్ దేవ్ బాబా, పతంజలీ యోగపీఠం దేశ-విదేశాలలో పెద్ద యోగా శిబిరాలు నిర్వహించారు. పతంజలి ద్వారా యోగాకు విశేష ప్రాచుర్యం లభించింది. 2015లో మొదటి సారి 177 దేశాలు యోగా దినోత్సవం జరుపుకోవడంలో పతంజలీ ముఖ్యమైన పాత్ర పోషించింది. పతంజలీ యోగా సులభమైనది.. శాస్త్రీయంగా సరైనది. ఉచితంగా యోగాను నేర్చుకోవచ్చు. ప్రతిరోజు యోగా చేయడంతో మానసిక ఒత్తిడి, ఒబెసిటీ, గుండెపోటు, షుగర్, ఆస్తమా, ఆందోళన వంటి సమస్యలు రావు. రామ్ దేవ్ బాబా పతంజలీ యోగాను ఒక సాధనగా మాత్రమే కాకుండా.. ఆరోగ్యకరమైన జీవన శైలిగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు యోగా కేవలం అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి దేశాలలో కూడా ప్రాచుర్యం పొందింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









