YouTube New Features: మీరు ఎన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్ స్క్రిప్షన్ తీసుకున్నప్పటికీ, మీ ఖాళీ సమయంలో YouTubeలో వీడియోలను కచ్చితంగా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే YouTube ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్. అయితే యూట్యూబ్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు యూట్యూబ్ లో అనేక కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రీమియం యూజర్లకు..


యూట్యూబ్ వినియోగించే ప్రతి యూజర్ ఈ ప్రీమియం ఫీచర్‌ పొందేందుకు అవకాశం ఉంది. అయితే యూట్యూబ్ ప్రీమియం సభ్యులకు అందుబాటులోకి వచ్చిన మోస్ట్ రీప్లేస్డ్ ఫీచర్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడీ ఫీచర్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ లో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా యూట్యూబ్ వీడియో ప్లేయర్ కు గ్రాఫ్ ను జోడించింది. ఈ గ్రాఫ్ వల్ల వీడియోలోని ఏ భాగాన్ని ఎక్కువగా వీక్షిస్తున్నారో తెలిసిపోతుంది. ఈ గ్రాఫ్‌ను రెడ్ ప్లేబ్యాక్ ప్రోగ్రెస్ బార్ సహాయంతో యాక్సెస్ చేయవచ్చు.


ఈ కొత్త ఫీచర్ ద్వారా వీడియోలోని ఇష్టమైన భాగాన్ని సులభంగా మళ్లీ మళ్లీ వీక్షించవచ్చు. కొత్త ఫీచర్ల జాబితాలో తదుపరి ఫీచర్ వీడియో చాప్టర్స్ ఫీచర్. ఇది మొదటిసారిగా స్మార్ట్ టీవీలు, గేమింగ్ కన్సోల్‌ల కోసం మే 2020లో విడుదల చేశారు. ఈ ఫీచర్ సహాయంతో, మీరు ఏదైనా వీడియోలోని నిర్దిష్ట విభాగానికి వెళ్లి, నచ్చిన వీడియోను మళ్లీ, మళ్లీ చూడొచ్చు. 


దీంతో పాటు యూట్యూబ్ మరో రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో మొదటిది సింగిల్ లుక్ ఫీచర్. రెండోది సీక్ టు ఎక్సాక్ట్ మూమెంట్ ఫీచర్. సీక్ టు ఎక్సాక్ట్ మూమెంట్ ఫీచర్ ప్రస్తుతం ప్రీమియం వినియోగదారులకు మాత్రమే వాడుకలో ఉంది.


Also Read: Petrol, Diesel Price Today: వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రప్రభుత్వాలు.. పెట్రోల్-డీజిల్ ధరలు ఏ నగరంలో ఎంత..?


Also Read: Amazon Offer: అమెజాన్ బంపరాఫర్.. ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, స్పీకర్స్ ఇంకా మరెన్నో వాటిపై భారీ డిస్కౌంట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook